ఒప్పించలేకపోయారు: అనంత, స్పీకర్‌పై లగడపాటి ఒత్తిడి

Anantha Venkatrami Reddy
అనంతపురం/న్యూఢిల్లీ: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారని అనంతపురం కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు అనంత వెంకట్రామి రెడ్డి మంగళవారం అన్నారు. కేంద్రమంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. వారి వ్యాఖ్యల ద్వారా ప్రజలు గందరగోళ పడుతున్నారని అభిప్రాయపడ్డారు.

తమ పైన ఎలాంటి ఒత్తిళ్లు లేవని, రాజీనామాలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. సమైక్య ప్రకటన వచ్చే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు.

జివోఎంను కలుస్తాం: పనబాక

తాము మంత్రుల బృందాన్ని(జివోఎం) కలుస్తామని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వేరుగా అన్నారు. విద్యావకాశాలు, నీటి సమస్యలపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలోని సమస్యను తాము జివోఎంకు వివరిస్తామని చెప్పారు.

రాజీనామా ఆమోదానికి లగడపాటి ఒత్తిడి

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తన రాజీనామా ఆమోదానికి స్పీకర్ మీరా కుమార్ పైన మంగళవారం కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీనామా ఆమోదం కోసం ఆయన ప్రయత్నిస్తుండగా స్పీకర్ అందుబాటులో లేరు. మరోవైపు తాను వారం రోజుల్లో స్పీకర్‌ను కలిసి తన వాదన వినిపిస్తానని, రాజీనామాను ఆమోదింప చేసుకుంటానని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+