యాంకర్ శ్యామల జీవితాన్ని మార్చేసిన గుంటనక్క, తోడేలు కథ!!
యాంకర్ శ్యామల.. తనకు మాలిన రాజకీయాలలో తగుదునమ్మా అంటూ వెళ్లి అనవసరంగా బంగారం లాంటి కెరీర్ ను నాశనం చేసుకుంది. ప్రస్తుతం యాంకర్ శ్యామలకు అటు బుల్లితెర, ఇటు వెండితెరలోను అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పర్యవసానం తెలీకుండా అర్ధం లేని మాటలు మాట్లాడినందుకు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సి వస్తుంది.
వైసీపీ కోసం యాంకర్ శ్యామల
ఓవైపు మూవీ ప్రమోషన్స్ తో, మరోవైపు వివిధ టీవీ చానల్స్ లో యాంకరింగ్ తో పాటు, నటి గానూ మంచి పేరు సంపాదించింది యాంకర్ శ్యామల. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన శ్యామల ఆ పార్టీ తరఫున ప్రచారం చేసింది. అంతకు ముందు వైసీపీ గెలిచిన సమయంలోనూ యాంకర్ శ్యామల వైసీపీ కోసం ప్రచారం చేసింది.

ఎన్నికల సమయంలో గుంటనక్క, తోడేలు కథ చెప్పిన యాంకర్ శ్యామల
ఇక 2024 ఎన్నికలలోను వైసీపీకి జోరుగా ప్రచారం చేసిన శ్యామల, పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగ గీతకు ప్రచారం చేసింది. శ్యామల కేవలం ప్రచారానికే పరిమితం కాలేదు. పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును టార్గెట్ చేసి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. గుంట నక్క, తోడేలు అంటూ ఒక సుదీర్ఘమైన కథనే చెప్పింది. ఇక శ్యామల కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యాంకర్ శ్యామలపై ట్రోల్స్
ఇక యాంకర్ శ్యామల చెప్పిన గుంట నక్క తోడేలు కథ.. ఆమెపై విమర్శలకు కారణమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడం ఓకే కానీ పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన కథలు చెప్పేంత, అనుచిత వ్యాఖ్యలు చేసేంత అవసరం లేదని యాంకర్ శ్యామల పైన చంద్రబాబు , పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు. ఆమెను ట్రోల్ చేశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యల పర్యవసానం
వైసిపి తరపున ప్రచారం చేసుకుంటే ఓకే కానీ చంద్రబాబు రాజకీయ అనుభవం అంత కూడా శ్యామల జీవితం లేదని, అటువంటి శ్యామల చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమేమిటని నిప్పులు చెరిగారు. ఇక ఏపీ ఎన్నికలలో వైసిపి ఘోర పరాజయం పాలైంది. టిడిపి కూటమి విజయం సాధించింది. దీంతో శ్యామలకు కష్టాలు మొదలయ్యాయని తనను అప్పటికే కాల్ చేసి కొంతమంది బెదిరించారని శ్యామల ఒక వీడియో రిలీజ్ చేసి ఆవేదనను బయటపెట్టింది.
యాంకర్ గా శ్యామల ఔట్.. సినిమా ఛాన్సులు కష్టమే
ఇదిలా ఉంటే తాజాగా శ్యామలను ఈటీవీ, మాటీవీ పక్కన పెట్టాయని సమాచారం. యాంకర్ గా శ్యామలకు భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వబోమని వీరు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో, మెగా ఫ్యామిలీతో పెట్టుకున్న శ్యామలకు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అనవసరంగా గుంట నక్క తోడేలు అంటూ కథ చెప్పి శ్యామల తన భవిష్యత్తును తానే నాశనం చేసుకుందని తెలుగు రాష్ట్రాలలో టాక్ వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications