టీడీపీ జాబితాపై వీడిన ఉత్కంఠత

TDP list: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు పూర్తి చేసింది. ఒకే విడతలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.

నిజానికి- ఈ నెల 4 లేదా 5వ తేదీల్లో 35 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేయాలని తొలుత చంద్రబాబు భావించినప్పటికీ.. ఢిల్లీ బీజేపీతో పొత్తు అంశంపై తేలాల్సి ఉన్నందున అధి సాధ్యపడలేదు. తమ కూటమిలో బీజేపీ కూడా చేరుతుందనే ఆశతో ఉన్నారాయన. బీజేపీతో పొత్తు అంశం తేలకముందే అభ్యర్థులను ప్రకటిస్తే.. సీట్ల సర్దుబాబులో ఇబ్బందులవుతాయనే ఉద్దేశంతో తొలి జాబితాను విడుదల చేయలేదు.

Andhra Assembly elections 2024: TDP plans for the release all the MLA candidates list in single phase

7వ తేదీన ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత షాతో భేటీ అయ్యారు. పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించారు. టీడీపీ- జనసేన కూటమితో కలవడానికి అమిత్ షా పెట్టిన ప్రతిపాదనలపై అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోయారు. ఉత్త చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది.

అనుకున్న దాని కంటే ఎక్కువగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను తమకు కేటాయించాల్సి ఉంటుందంటూ అమిత్ షా తేల్చి చెప్పారనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షా పెట్టిన ప్రతిపాదనలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తోన్నారు. వారి అభిప్రాయాలను సేకరిస్తోన్నారు. జనసేనతోనూ మంతనాలు సాగిస్తోన్నారు.

Andhra Assembly elections 2024: TDP plans for the release all the MLA candidates list in single phase

ఆయా పరిణామాల వల్ల అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం చోటు చేసుకుంటోన్నందున.. ఇక ఒకేసారి అభ్యర్థులందరి పేర్లనూ ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి ఒక జాబితా, లోక్‌సభకు మరో జాబితాను విడుదల చేస్తారని, దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయిందని అంటున్నారు.

ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలను తీసుకుంది తెలుగుదేశం పార్టీ. అభ్యర్థుల ఎంపికలో ఇంటారిక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానాన్ని అనుసరించింది. నేరుగా ఓటర్ల నుంచే అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించిన తరువాతే తొలి జాబితాకు తుది రూపాన్ని ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+