వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ జీతం ఒక్కరూపాయే: ఇన్‌కమ్ ట్యాక్స్ మాత్రం రూ. లక్షల్లో: ఎంత కట్టారో తెలుసా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయపు పన్ను మొత్తం.. ప్రస్తుతం వివాదాస్పదమౌతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు..దీనిపై రచ్చ చేస్తోన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఒక్క రూపాయి జీతాన్ని తీసుకుంటూ లక్షల రూపాయల్లో ఎలా ఆదాయపు పన్నును చెల్లించగలుగుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీనితో ముఖ్యమంత్రితో పాటు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆదాయపు పన్ను చెల్లింపు వ్యవహారం కూడా వివాదాలకు కేంద్రబిందువుగా మారినట్టయింది.

న్యాయ రాజధానికి వైఎస్ జగన్: హైకోర్టుకు స్థలం కేటాయించిన తరువాత తొలిసారిగా: ఎయిర్‌పోర్ట్న్యాయ రాజధానికి వైఎస్ జగన్: హైకోర్టుకు స్థలం కేటాయించిన తరువాత తొలిసారిగా: ఎయిర్‌పోర్ట్

ఈ నెల 31వ తేదీన ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ జగన్ 7,14,924 రూపాయలను ఆదాయపు పన్నుగా చెల్లించారు. మంత్రి పేర్ని నాని ఆదాయపు పన్ను మొత్తం 2,91,096. ఈ రెండింటినీ కలిపి 10,06,020 రూపాయల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని మంత్రులు, ఉప మంత్రుల వేతనాల అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.

Andhra CM YS Jagan paid Rs 7.4 lakh income tax for FY 2020-21

ఈ ఉత్తర్వులు ప్రస్తుతం వివాదాన్ని రేపుతున్నాయి. ఒక్క రూపాయిని నెల జీతంగా తీసుకుంటోన్న ముఖ్యమంత్రి.. ఏకంగా ఏడు లక్షల రూపాయలకు పైగా ఆదాయపు పన్నును ఎలా? ఎందుకు చెల్లించాల్సి వచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో వైఎస్ జగన్‌ను ట్రోల్ చేస్తోన్నారు. తాను ఒక్క రూపాయి మాత్రమే జీతాన్ని తీసుకుంటున్నానంటూ ముఖ్యమంత్రి ఇదివరకు చెప్పిన మాటలు అబద్ధమని తేలిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ఆదాయపు పన్ను వ్యక్తిగతమైనదే అయితే.. ప్రభుత్వం ఎందుకు చెల్లించిందని ప్రశ్నిస్తున్నారు.

English summary
Andhra Pradesh government paid 7,14,924 lakh Income tax for Chief Minister YS Jagan Mohan Reddy and Rs 2,91,096 lakh for transport minister Perni Nani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X