నేపాల్ నుంచి బయల్దేరిన ఏపీ వాసులు..! ఆర్టీజీఎస్ నుంచి లోకేష్ సమీక్ష..!

జెన్ జీ నిరసనల కారణంగా నేపాల్ లో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ప్రధాని కేపీ ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ను పదవుల నుంచి దింపేసిన నిరసనకారులు తదుపరి ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ లో చిక్కుకుపోయిన 200 మందికి పైగా ఏపీ వాసుల్ని స్వరాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించడంతో దశల వారీగా రాష్ట్రానికి వారు చేరుకుంటున్నారు.

నేపాల్ లోని పోఖరా నుండి 10మంది తెలుగు పౌరులు ఇవాళ మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రత్యేక విమానంలో ఖాట్మండూ చేరుకున్నారు. అనంతరం వారిని ఖాట్మండూ నుంచి విశాఖ బయలుదేరే ఇండిగో విమానంలో రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఖాట్మండూ నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నేపాల్ లో చిక్కుకున్న పలువురు ఏపీ వాసులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు.

Andhra people evacuations continue from Nepal nara Lokesh review from RTGS

మరికొందరు భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారు. నిన్న ముందుగా హేటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది బీహార్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. అదేవిధంగా సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని భారత సరిహద్దులోని నేపాల్ గంజ్ కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించనున్నారు. లక్నో నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో పంపే ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.

Andhra people evacuations continue from Nepal nara Lokesh review from RTGS

నేపాల్ నుంచి ఏపీ పౌరుల తరలింపును మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్ సచివాలయంలోని ఆర్జీజీఎస్ నుంచి సమీక్షిస్తున్నారు. ఆర్ టి జి ఎస్ వార్ రూమ్ నుంచి మంత్రి లోకేష్ నిర్వహించిన సమీక్షలో ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేకాధికారి అర్జా శ్రీకాంత్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ తో పాటు పలువురు జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నేపాల్ నుండి రాష్ట్రానికి రాబోతున్న వారికి స్వాగతం పలికేందుకు కూటమి ప్రజా ప్రతినిధులు ఆయా ఎయిర్ పోర్టులకు చేరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+