అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Amravati: నిరసనలతో స్వాగతం: హ్యాపీ న్యూ ఇయర్ కాదు..సేవ్ అమరావతి అంటూ ముగ్గులు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

#happynewyear2020 : No Happy New year Save Amaravati | farmers protest with Rangoli

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన కొనసాగుతూనే వస్తోంది. కొత్త సంవత్సరాన్ని కూడా వారు తమ నిరసనలతోనే స్వాగతించారు. సేవ్ అమరావతి అంటూ ముగ్గులు వేశారు. రాజధాని అమరావతి పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది.

15వ రోజుకు నిరసనలు.

15వ రోజుకు నిరసనలు.

కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ.. ముగ్గులు వేయడం సాధారణం. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ముగ్గులు వేస్తుంటారు. బుధవారం తెల్లవారు జామున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.. ఒక్క అమరావతి ప్రాంతంలో తప్ప. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు 15వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో.. కొత్త సంవత్సరానికి కూడా అదే తరహాలో స్వాగతం పలికారు.

సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ..

సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ..


సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ముగ్గులు వేశారు. అమరావతి పరిధిలోని ఎర్రబాలెం, నీరుకొండ, పెదపరిమి వంటి పలు గ్రామాల్లో ఇవే తరహా ముగ్గులు కనిపించాయి. రైతు కుటంబాలకు చెందిన మహిళలు బుధవారం తెల్లవారు జాము నుంచే సేవ్ అమరావతి అంటూ ముగ్గులు వేశారు. ప్రభుత్వానికి తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. తాము వేసిన రంగవల్లులతో నిరసనను వ్యక్తం చేశారు.

ఎవరూ హ్యాపీగా లేరంటూ..

ఎవరూ హ్యాపీగా లేరంటూ..

నిరసనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఏ వేడుకైనా శోభాయమానంగా ఉంటుందని అన్నారు. అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఏ మాత్రం సంతోషంగా లేరని అన్నారు. వారికి సంఘీభావంగా 2020 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని తెదేపా నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

English summary
Amaravati region farmers protest different way with Rangoli in Andhra Pradesh. Amaravati farmers protest against Chief Minister YS Jagan Mohan Reddy's decision as three capital cities for the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X