అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులకు 9 అసెంబ్లీ సెగ్మెంట్లు, కొత్త మంత్రులకు బాబు టార్గెట్

చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్న వారికి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఆనందం ఎక్కువ సేపు లేదు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబునాయుడు లక్ష్యాలను నిర్ధేశించడంతో మంత్రులుగా

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్న వారికి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఆనందం ఎక్కువ సేపు లేదు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబునాయుడు లక్ష్యాలను నిర్ధేశించడంతో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఆనందం ఎంతోసేపు నిలువలేదు.

ఏప్రిల్ రెండో తేదిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అయితే నలుగురిని మంత్రివర్గం నుండి తప్పించి మరో 11 మందికి చోటు కల్పించారు.

అయితే వైసీపి నుండి వచ్చిన నలుగురికి కూడ మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే ఈ వ్యవహరంలో బాబుపై వైసీపీ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసింది.

మరో వైపు 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని చంద్రబాబునాయుడు మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు. తాము గెలవడంతో పాటు ఇతర నియోజవకర్గాల్లో కూడ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా మంత్రులకు బాధ్యతలను అప్పగించారు బాబు.

కొత్త మంత్రులకు టార్గెట్లు

కొత్త మంత్రులకు టార్గెట్లు

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారికి ఎక్కువసేపు తాము మంత్రులుగా ప్రమాణం చేసిన ఆనందం లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రులకు బాబు దిశానిర్ధేశం చేశాడు.కొత్త మంత్రులతో బాబు సమావేశం ఏర్పాటు చేశారు.ఒక్కో మంత్రికి 9 అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పగిస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పునర్విభజన తర్వాత ఏర్పాటయ్యే మరో రెండు నియోజకవర్గాల్లో కూడ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని బాబు టార్గెట్ పెట్టాడు.

పార్టీ బలంగా ఉంటేనే అధికారంలో ఉంటాం

పార్టీ బలంగా ఉంటేనే అధికారంలో ఉంటాం

పార్టీ పటిష్టంగా ఉంటేనే అధికారంలో ఉంటామనే ప్రాథమిక సూత్రాన్ని ఎవరూ కూడ విస్మరించకూడదని బాబు మంత్రులకు సూచించారు.పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేయాలని ఆయన మంత్రులకు సూచించారు.పార్టీని నిర్లక్ష్యం చేస్తే అధికారానికి దూరమయ్యే పరిస్థితి ఉంటుందని ఆయన వివరించారు.పదేళ్ళపాటు అధికారానికి దూరమైతే ఎదురైన పరిస్థితులను ఆయన ప్రస్తావించారు.

మూడు కేటగిరిలుగా ఎమ్మెల్యేల విభజన

మూడు కేటగిరిలుగా ఎమ్మెల్యేల విభజన

ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు మూడు కేటగిరిలుగా విభజించారు. మొదటి కేటగిరిలో గెలిచేవాళ్ళు, ప్రత్యర్థి ఎంత గట్టివాడైనా కాని విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేసేవారు మొదటి కేటగిరి జాబితాలోకి వస్తారని బాబు చెప్పారు. ఇక రెండో కేటగిరిలో పొరపాట్లు సర్ధుకొని విజయం సాధించేవారని చెప్పారు.మూడో కేటగిరిలో చెప్పినా వినకుండా వ్యవహరిస్తున్న వాళ్ళను ఉంచారు చంద్రబాబునాయుడు.

ట్రయిలర్ మాత్రమే సినిమా ముందుంది

ట్రయిలర్ మాత్రమే సినిమా ముందుంది

కొత్త మంత్రులకు చంద్రబాబునాయుడు ట్రయిలర్ మాత్రమే చూపించాడు. పుల్ లెంగ్ షో ముందుంటుందని చావు కబురు చల్లగా మంత్రివర్గ సమావేశంలో చెప్పాడు. అయితే సినిమా విడుదల సమయంలో ట్రయిలర్ ను బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అయితే భవిష్యత్ తో పుల్ లెంగ్త్ సినిమా ఉంటుందని చంద్రబాబు చెప్పడంతో మంత్రులు ఆవాక్కయ్యారు.

English summary
Andhra pradesh chief minister planned for 2019 elections, He alloted each minister 9 assembly segments.Babu ordered to ministers to takecare those segements for win tdp candidates in 2019 elections .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X