రోజా మేడమ్ మాయం, చిన్నగా చెన్నై వెళ్లిపోయారా?, నగిరిలో హాట్ టాపిక్, మీడియాకు?
సినీనటి, మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్ కే. రోజా ఎక్కడ ఉన్నారు అని నగిరి ప్రజలు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పతనం అయిన తరువాత రోజా కూడా మాయం అయ్యారు. రోజా నగిరిలో ఉన్నారా ? లేరా ? అనే విషయం కూడా అంతు చిక్కడం లేదని నగరి పట్టణ ప్రజలు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తరువాత రోజాను పలకరించడానికి మీడియా ప్రయత్నించింది.
నగిరిలోని రోజా ఇంటి గేటు మూసివేశారు. ఇంటి తలుపులు కూడా మూసివేసి ఉన్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. రోజా ఇంటి దగ్గర వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా కనపడటం లేదు. రోజా ఏమైనారు అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ జరిగే ముందు వరకు వద్దంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన రోజా ఇప్పుడు అదే మీడియా కంటపడకుండా మాయం అయ్యారు.

కనీసం రోజా నగిరిలో ఉన్నారా, చిన్నగా చెన్నై వెళ్లిపోయారా అని నగిరి ప్రజలు చర్చించుకుంటున్నారు. రోజా ఇంటిలో ఉంటే కనీసం వైసీపీ కార్యకర్తలు, నాయకులు అయినా ఆమెను పలకరించడానికి వెళ్లాలి కదా ? అనే ప్రశ్న నగిరి ప్రజల్లో మొదలైయ్యింది. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్ ను రోజా ఎంత చులకనగా మాట్లాడారో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రెండు రోజుల క్రితం ఆదివారం తిరుపలకు వెళ్లిన రోజా ఆంధ్రప్రదేశ్ లో మా ప్రభుత్వం వస్తుందని, ప్రజలు జగనన్న వన్స్ మోర్ అంటూ వైసీపీని ఆధరించారని, అందులో ఎలాంటి సందేహం లేదని బల్లగుద్దినట్లు చెప్పారు. అయితే మంగళవారం చిత్తూరులోని కౌంటింగ్ కేంద్రం దగ్గర కనపడిన రోజా తరువాత మాయం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రోజా మేడమ్ ఎక్కడ అంటూ నగిరి నియోజక వర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications