కాణిపాకం ఈవో ఔట్, వినాయకుడికి కాదు పెద్దిరెడ్డికి పరమ భక్తుడు, సీఎం సీరియస్

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కొదవలేదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల, శ్రీకాళహస్తి తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన శ్రీవరసిద్ది వినాయకుడి ఆలయం ఉన్న కాణిపాకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకుంటే కష్టాలు తీరుతాయని భక్తులకు ఎంతో నమ్మకం ఉంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకతో సహా దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు కాణిపాకం చేరుకుని శ్రీవరసిద్ది వినాయకుడు దర్శించుకుంటారు. అలాంటి కాణిపాకంలో శ్రీవరసిద్ది వినాయకుడి ఆలయంలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తూ ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులకు అడుగులకు మడుగుల మొక్కుతూ ఇంతకాలం తన పదవిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వివో ఏ. వెంకటేశు అలియాస్ వెంకటేశంను బదిలీ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

Andhra Pradesh government has issued orders transferring Kanipakam EO Venkateshu

రెవెన్యూ శాఖకు చెందిన వెంకటేశు గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో 2020 జూన్ నెలలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏప్రిల్ వరకు వెంకటేశు ఈవోగా పని చేశారు. 2022 నవంబర్ లో మరోసారి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశు వినాయకుడి ఆలయంలో పెత్తనం చాలాయించాడని ఆరోపణలు ఉన్నాయి. అప్పటినుండి వైసీపీ నాయకులకు సలాం చేస్తున్న వెంకటేశు నేటి వరకు ఆపదవిలో కొనసాగారు.

ఇంత పవిత్రమైన శ్రీవరసిద్ది వినాయక స్వామి ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న వెంకటేశు వైసీపీకి విరవిధేయుడిగా ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రామకుప్పం మండలం వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగంగా ఎన్నికల ప్రచారం చేసిన ఈవో వెంకటేశు వివాదాల్లో చిక్కుకున్నాడు. అప్పట్లోనే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈవో వెంకటేశుపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh government has issued orders transferring Kanipakam EO Venkateshu

అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ ఉండటంతో ఈవో వెంకటేశుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి తనకు ఎదురేలేదని వెంకటేశు చెలరేగిపోయాడు. అంతేకాకుండా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని ఈవో వెంకటేశు చాలా ఇబ్బందులకు గురి చేశాడని ఆక్కడి సిబ్బంది, ఉద్యోగులు ఆరోపించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలతో మంచిపలుకుబడి పెట్టుకున్న ఈవో వెంకటేశు ని ఎదిరించి ఏమి చేయలేని సిబ్బంది ఇంతకాలం న మౌనంగా ఉండిపోయారు.

ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం వచ్చినా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈవో వెంకటేశుపై బదిలీ వేటు పడలేదు. రెండు నెలలపాటు తాను బదిలీ కాకుండా వెంకటేశు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈవో వెంకటేశును బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఇంతకాలం వైసీపీ కి అనుకూలంగా ఉన్న ఈవో వెంకటేశు అదే పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఎదురు తిరిగారు. కాణిపాకం శ్రీవరసిద్ది వినాయకస్వామి ఆలయం ఈవో పదవి నుంచి వెంకటేశు బదిలీ కావడంతో వైసీపీలోనే సంబరాలు మొదలైనాయి, వైసీపీ ఎంపీటీసీ భర్త సుధీర్, కాణిపాకం ఉదయదారులు, స్థానిక ప్రజలు ఆలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది కాణిపాకంలోని పాత బస్టాండ్ సర్కిల్, గొల్లవీధి తో పాటు కాణిపాకం లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇంతకాలం దేవుడు గుడిలో కీలకమైన పదవిలో ఉన్న వెంకటేష్ ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవడంతో కాణిపాకంలో భక్తులకు మంచి రోజులు మొదలైనాయని కాణిపాకం ఉభయదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+