అంగన్వాడీలకు జగన్ సర్కారు గుడ్‌న్యూస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి తక్షణమే రూ. 80 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ల గరిష్ట వయో పరిమితి 62 ఏళ్లకు పెంచింది. రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ వర్కర్లకు రూ. ఒక లక్ష, హెల్పర్లకు రూ.40 వేల లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రంలో అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి సహాయకురాళ్ళు డిసెంబర్ 12, 2023 నుంచి వారి డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కరానికి చర్యలు చేపట్టింది.

అంగన్వాడి సెంటర్లు, అద్దె భవనాల్లో నిర్వహించబడుతున్న సెంటర్లకు ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రామీణ/గిరిజన ప్రాంతాల్లో ఉన్న 16,575 అద్దె భవనాలకు, పట్టణాల్లో ఉన్న 6,705 అద్దె భవనాలకు రూ.66.54 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా అద్దె బకాయిల చెల్లించేందుకు నిర్ణయించింది.
అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన చీపురులు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 48,770 మెయిన్ అంగన్వాడి సెంటర్స్ కు (ఒక మెయిన్ అంగన్వాడి సెంటర్ కు రూ.500) 6,837 మినీ అంగన్వాడి సెంటర్స్ కు (ఒక మినీ అంగన్వాడి సెంటర్ కు రూ.250) మొత్తం 55,607 సెంటర్లకి రూ.7.81 కోట్ల నిధులను మంజూరు చేసింది.
అంగన్వాడీ సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్‌లు, చిన్నపాటి మరమ్మత్తుల క్రింద 21, 206 అంగన్వాడి సెంటర్స్ కు (ఒకొక్క కేంద్రానికి రూ.3000 చొప్పున) రూ.6.36 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులను అంగన్వాడి కార్యకర్తలే కేంద్రం అవసరమును బట్టి ఖర్చు చేయనున్నారు.
అంగన్వాడీ సహాయకురాలను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితిని 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరములకు పెంచుతూ G.O.MS:44 తేది 20.12.2023 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ల కొనసాగింపుకు గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ వర్కర్లకు రూ.1 లక్ష, హెల్పర్లకు రూ.40,000 వేలు సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం G.O.MS.No:47 తేది 20.12.2023న ఉత్తర్వులు జారీ చేసింది.
టీఏ/డీఏ సౌకర్యం కల్పించాలని వర్కర్స్, హెల్పర్స్ విజ్ఞప్తిపై ప్రభుత్వం నిశితంగా పరిసశీలించిన తరువాత ఆంగన్వాడీ వర్కర్లకు TA/DA నెలకు ఒకసారి, అంగన్వాడి హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం మెమో నెంబర్.2303564/2023/PROG-I-A1, ఉత్తర్వులు 20.12.2023 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications