భారీగా ఐఏఎస్ ల బదిలీ.. మీ జిల్లాకు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల స్థాయిలో పరిపాలన మరింత సమర్థంగా సాగేందుకు ఈ మార్పులు దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ బదిలీల్లో భాగంగా ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. శ్రీనివాసులును అక్కడి నుంచి మార్చి, ఆయనను మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. అదే సమయంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా ఉన్న రోణంకి గోపాలకృష్ణకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వైద్య-ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది.

పౌర సరఫరాల విభాగంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీవాస్ నుపుర్ అజయ్‌కుమార్ పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా నియమించగా, కల్పన కుమారికి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా పరిపాలనలో భాగంగా మల్లవరపు సూర్యతేజను అనకాపల్లి జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. అలాగే ఆదర్శ్ రాజేంద్రన్కు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. గిరిజన సంక్షేమ రంగంలో కీలకంగా ఉన్న గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్. శోబికను ప్రభుత్వం నియమించింది.
ఇక కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా, విశాఖ జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ల విద్యాధరి, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శివ్ నారాయణ్ శర్మ, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజనా సింహను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ బదిలీల్లో ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే... కడప జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నిధి మీనా, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషంగా నిలిచింది. జిల్లా పరిపాలన, పోలీస్ యంత్రాంగం రెండింటిలోనూ కీలక స్థానాల్లో దంపతులు ఉండటం ఆసక్తికరంగా మారింది.
Download











Click it and Unblock the Notifications