మా సమస్యలూ తీర్చాలి: పవన్‌ కోసం పెట్రోలియం డీలర్ల సంప్రదింపులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ సభ్యులు. ఈ విషయంపై మంగళవారం గుంటూరు జిల్లాలో వారు జనసేన నేతలను కలిసి చర్చించారు.

తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన జనసేన నేతలు దసరా ఉత్సవాల తర్వాత పవన్ కళ్యాణ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

andhra pradesh petroleum dealers association wants to meet pawan kalyan

కాగా, ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో పరిష్కారమైన నేపథ్యంలో పెట్రోలియం డీలర్లు కూడా తమను పవన్‌కు వెళ్లడించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

పిల్లల మనోభావాలు గౌరవించాలి: చంద్రబాబు

పిల్ల‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చ‌ంద్ర‌బాబు నాయుడు అన్నారు. మంగళవారం క‌ర్నూలు జిల్లాలోని ఏపీఎస్పీ బెటాలియ‌న్ మైదానంలో 'బాల‌ల భ‌ద్ర‌తే భార‌త భ‌ద్ర‌త' పేరుతో బ‌హిరంగ స‌భ జ‌రిగింది. ఈ సభకు హాజరైన చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ... బాల కార్మిక వ్య‌వ‌స్థ పూర్తిగా న‌శించిపోవాల‌ని, పిల్ల‌ల జీవితాల‌ను నాశ‌నం చేసే హ‌క్కు ఎవరికీ లేదని చెప్పారు.

త‌మ పిల్ల‌ల‌కు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వంటి ఘ‌ట‌న‌ల‌కు త‌ల్లిదండ్రులు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని అన్నారు. పిల్లలు దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. చదువును కొనసాగించేందుకు సహకరించకపోవడం, వారిని పనుల్లో పెట్టడం వంటివి అనాగ‌రికులు చేసే చ‌ర్య‌లుగా చంద్ర‌బాబు అభివ‌ర్ణించారు.

పిల్ల‌ల హ‌క్కుల‌ను ప‌రిరక్షించాల‌ని 40 ఏళ్లుగా కైలాశ్ స‌త్యార్థి పోరాడుతున్నారని అన్నారు. పిల్ల‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం కైలాశ్ స‌త్యార్థి నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నారని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Andhra Pradesh Petroleum Dealers Association wanted to meet Janasena President Pawan Kalyan to discuss their problems.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X