పాస్ పోర్ట్ వెరిఫికేషన్, క్లియరెన్స్ లో దేశంలోనే ఏపీ టాప్- వరుసగా రెండోసారి...
దేశంలో పాస్ పోర్ట్ ధృవపత్రాల తనిఖీ, పాస్ పోర్టుల జారీలో ఆంధ్రప్రదేశ్ మరోసారి అగ్రస్ధానంలో నిలిచింది. ఇప్పటికే 2018-19 సంవత్సరానికి పాస్ పోర్టు వెరిఫికేషన్ లో బెస్ట్ స్టేట్ గా అవార్డు అందుకున్న ఏపీ.. 2019-20 సంవత్సరానికి మరోసారి అగ్రస్దానంలో నిలిచి అవార్డు సొంతం చేసుకుంది.
పాస్ పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ధృవపత్రాల తనిఖీలు నిజాయితీగా చేస్తున్నారా లేదా, ఎంత సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు, పాస్ పోర్టుల జారీపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయా లేదా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా విదేశీ వ్యవహారాలశాఖ ఈ అవార్డులను ప్రకటిస్తోంది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓ ప్రహసనంగా సాగే పాస్ పోర్టుకు అవసరమైన ధృవపత్రాల తనిఖీ, వాటి క్లియరెన్స్ విషయంలో ఏపీ మాత్రం ఎంతో ముందుంది. ప్రజలకు అత్యుత్తమ రీతిలో పాస్ పోర్టు సేవలను అందిస్తున్నందుకు గానూ విదేశీ వ్యవహారాలశాఖ వరుసగా రెండో ఏడాది ఏపీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
Recommended Video
ప్రజలకు అత్యుత్తమ పాస్ పోర్టు సేవలు అందిస్తున్న ఏపీ పోలీసు విభాగానికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ మరింతగా సన్నద్ధంగా ఉంటుందని డీజీపీ గౌతం సవాంగ్ ఈ సందర్బంగా తెలిపారు.












Click it and Unblock the Notifications