తాడేపల్లి బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు: లైంగిక దాడి చేసి దారుణ హత్య, మరో బాలుడ్నీ..
గుంటూరు: తాడేపల్లి మండలంలో మార్చి 14న భార్గవతేజ అనే ఆరేళ్ల బాలుడి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మెల్లంపూడి గ్రామానికి చెందిన గోపీ అనే యువకుడు ఈ బాలుడిని హత్య చేసినట్లు విచారణలో తేల్చారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు వివరాలను తెలిపారు.
51
ఏళ్ళ
వయసులోనూ
లైంగిక
వేధింపులు
..
66మంది
మహిళలు,
బాలికల
ఫిర్యాదుతో
యూపీ
వ్యక్తి
అరెస్ట్

పిల్లల్ని కిడ్నాప్ చేసి లైంగిక దాడి, ఆపై హత్యలు
చెడు సాహసావాలకు అలవాటుపడిన నిందితుడు గోపీ చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఎదురు తిరిగితే హతమార్చేవాడు. చంపేసిన అనంతరం కూడా లైంగికంగా దాడి చేసేవాడు. భార్గవతేజాను కూడా గోపీ అత్యంత దారుణంగా హత్య చేశాడు.

భార్గవతేజాతోపాటో మరో బాలుడ్ని చంపేశానంటూ నిందితుడు
పోలీసుల విచారణలో మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఫిబ్రవరి 11న కూడా ఇదే తరహాలో వడ్డేశ్వరంలో మరో బాలుడిని కిడ్నాప్ లైంగికదాడికి పాల్పడి హతమార్చినట్లు అంగీకరించాడు. ఆ బాలుడి మృతదేహాన్ని సమీపంలోని కృష్ణానదిలో పడేసినట్లు తెలిపాడు. ఆ మృతదేహం కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇలాంటి సైకోలు బయటఉంటే ప్రమాదం
విచక్షణ లేకుండా సైకోలా ప్రవర్తిస్తున్న నిందితుడు గోపీ సమాజంలో తిరిగితే ప్రమాదమని ఎస్పీ తెలిపారు. అందుకే త్వరగా ఛార్జీషీటు నమోదు చేసి నిందితుడికి కక్ష పడేలా చూస్తామని చెప్పారు. కాగా, నిందితుడు గోపీ తండ్రిది కూడా నేర చరిత్రేనని తేలింది. అతడు తన భార్యను హత్య చేసి జైలు శిక్ష అనుభవించినట్లు సమాచారం.

సిలిండర్ పేలి మహిళ సజీవ దహనం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎల్విన్‌పేటలో గ్యాస్ సిలిండర్ పేలి మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో విజయలక్ష్మి అనే మహిళ సజీవదహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని పెళ్లూరు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నట్లు తెలిసింది. బాధిత యువకుడు చీమకుర్తి మండలం గుడివాడ గ్రామానికి చెందిన మద్ది వెంకటసాయి కృష్ణగా, యువతి స్వస్థలం చీమకుర్తిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.