వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి హోదా?: అసంభవం, కాంగ్రెస్ చేసిన తప్పే మన పాలిట శాపంగా మారిందా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అనే అంశం లేదు కాబట్టి ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకహోదా ఆందోళనలు ఊపందుకున్నాయి.

రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగుతున్నా ఏపీకి ప్రత్యేకహోదా సాధించడంలో విఫలమైందంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది.

Andhra Pradesh won't get special status

అసలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వస్తుందా? ప్రత్యేకహోదా పొందడానికి గల అర్హతలు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయా? అసలు భారత రాజ్యాంగం ప్రకారం ఓ రాష్ట్రం ప్రత్యేకహోదా పొందడానికి ఉండాల్సిన అర్హతలను ఒక్కసారి పరిశీలిద్దాం. మన దేశంలో ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలంటే ఈ క్రింది పరిస్థితుల్లో మాత్రమే సాధ్యమని రాజ్యాంగం చెబుతోంది.

* పర్వతాలు, లోయలతో గూడి అతి సంక్లిష్టత కలిగిన ప్రజా జీవితం ఉన్న భూభాగం.
* గుర్తించదగిన సంఖ్యలో గిరిజనులు నివసించేలా ప్రాంతం ఉండాలి
* ఆర్ధికంగా వసతుల పరంగా వెనకబాటుతనాన్ని కలిగి ఉండాలి
* అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉండాలి
* వ్యూహాత్మకంగా సరిహద్దుదేశాలను ఇరుగు పొరుగుగా కలిగి ఉండాలి
* ఆర్ధికంగా ప్రయోజనమివ్వని ప్రకృతితో ఉన్న నైసర్గిక, వాతావరణ, భూభాగం కలిగి ఉండాలి

పైన పేర్కొన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టే మన దేశంలో 11 రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ప్రత్యేకహోదాను ప్రకటించింది. అవేమిటంటే అస్సాం, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, సిక్కిం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం మరియు ఉత్తరాఖండ్.

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పుడు ప్రత్యేకహోదా విషయం వచ్చినా ఉత్తరాఖండ్‌ పేరుని ప్రముఖంగా వినిపిస్తుంటారు. మరి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా పొందేందుకు తగిన అర్హతులున్నాయా లేదో ఒక్కసారి చూద్దాం. మన దేశాన్ని సుమారు 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్ వాళ్లు అభివృద్ధి చేసిన జల, నౌకా, రోడ్డు రవాణా వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ విలసిల్లింది.

అంతేకాదు నైజాం లేదా తెలంగాణా కంటే అత్యంత సారవంతమైన భూములతో, సాగు నీరు, తాగు నీరు, విస్తృతమైన పంట భూములు, డెల్టా ప్రాంతమైన గుంటూరు, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలు, నౌకా, పారిశ్రామిక సంస్ధలను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందంటారా?

లేదంటే ఏపీకి ప్రత్యేకహోదా రాదని తెలిసే ఆనాటి యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో దాని గురించి ప్రస్తావించలేదా? ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేసిన దుందుడుకు చర్య వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ఈనాడు ఈ గతి పట్టింది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించే దానిపై పెట్టిన శ్రద్ధ విభజన అనంతరం ఏపీ ఎదుర్కొనే సమస్యలపై పెట్టలేదనే చెప్పాలి.

ఆనాడు విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశం గురించి ఎందుకు బిల్లులో పెట్టలేదని ప్రశ్నించని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ దీక్షలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉంది.

English summary
Andhra Pradesh won't get special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X