• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ - జగన్ కు కేంద్రం షాక్: జలవివాదాలపై అనూహ్య నిర్ణయం - నాలుగేళ్ల తర్వాత 5న అపెక్స్ భేటీ

|

తెలుగురాష్ట్రలైన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు ముదిరిన నేపథ్యంలో పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పాత వివాదాలకుతోడు తాజాగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ అంశాలు జత కావడం రెండు రాష్ట్రాల జల సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఏపీ, తెలంగాణ పోటాపోటీగా కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మంట్ బోర్డులకు ఫిర్యాదులు చేసుకోవడం, రెండు రాష్ట్రాల్లోని పార్టీలూ లేఖలు రాసిన నేపథ్యంలో మోదీ సర్కార్ ఎట్టకేలకు పేద్దన పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అయితే, భేటీ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా, కేంద్రం ఏక పక్షంగా వ్యవహరిస్తుండటం, సమావేశానికి సీఎంలు హాజరయ్యేలా చూడాలంటూ సీఎస్ లకు, బోర్డు యాజమాన్యాలకు సూచించడం వివాదాస్పదంగా మారింది.

జగన్ కూతురు చదివే చోటా అదే తీరు - ఏపీ సీఎం వల్లే కేంద్రం కొత్త విద్యా విధానం - ఎంపీ రఘురామ సంచలనం

5న అపెక్స్ భేటీ..

5న అపెక్స్ భేటీ..

తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదాల పరిష్కాం కోసం నాలుగేళ్ల తర్వాత కేంద్ర సర్కారు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 5న జరుగనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్.. ఫేస్ టైమ్ ద్వారా తమ వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించే భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలతోపాటు కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లు, ఇతర ముఖ్య అధికారులు కూడా పాల్గొంటారు. అయితే..

నాపై భయానక కుట్ర - జగన్ కు అపకీర్తి వద్దనే ముందుకొచ్చా - పేకాట వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

పట్టింపు లేనట్లుగా వ్యవహారం..

పట్టింపు లేనట్లుగా వ్యవహారం..

ఏపీ సర్కారు చేపట్టిన రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుల వల్ల ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అపార నష్టం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది. అయితే ఈ వ్యవహారాన్ని బోర్డు పరిధిలో మాత్రమే తేల్చుకోవాలని కేసీఆర్ భావిస్తుండగా... ఏపీ తీరును గర్హిస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఇతర నేతలు కేంద్రానికి ఫిర్యాదులు చేయడంతో జల శక్తి మినిస్ట్రీ రంగంలోకి దిగింది. ఆగస్టు 5నాటి అపెక్స్ కౌన్సిల్ భేటీకి సంబంధించి కేంద్రం.. చాలా రోజుల కిందటే కిందటే రాష్ట్రాలకు, కృష్ణా బోర్డుకు కేంద్రం సమాచారం ఇచ్చి, ఎజెండా కోసం అంశాలను పంపాలని కోరినా.. రెండు రాష్ట్రాలూ పట్టింపు లేనట్లుగా వ్యవహరించాయి. దీంతో కేంద్రమే అజెండాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

అజెండాలో లేని పోతిరెడ్డిపాడు..

అజెండాలో లేని పోతిరెడ్డిపాడు..

పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల అంశాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలకు కారణం కాగా.. 5న జరుగనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీ అజెండాలో ఈ అంశాలను ప్రధానంగా పేర్కొనకపోవడం గమనార్హం. ‘ప్రాజెక్టులు-వాటి డీపీఆర్‌లు' అనే పాయింట్ కిందే తాజా వివాదాస్పద అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, వాటి డీపీఆర్‌లు, బోర్డుల పరిధి వంటి నాలుగు అంశాల ఎజెండాతో పాటే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి వాటాలు, మళ్లింపు జలాల అంశాలన్నింటిపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏపీ రాజధానికి తరలించే అంశంపైనా చర్చ జరుగనుంది.

నాలుగేళ్ల తర్వాత కేంద్రం పెద్దన్నగా..

నాలుగేళ్ల తర్వాత కేంద్రం పెద్దన్నగా..

కృష్ణా, గోదావరి బేసిన్ ల పరిధిలో ఏపీ, తెలంగాణ చేపట్టిన, కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులపై గతం నుంచే విభేదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. నదీ యాజమాన్య బోర్డులు, కోర్టుల్లో కొట్టాడుకోవడం పరిపాటిగా మారిన నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ ద్వారా సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకొచ్చింది. 2016 సెప్టెంబర్‌ 21న తొలిసారి అప్పటి కేంద్ర జల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించారు. తదనంతరం వివాదాలు ముదిరి, కొత్తవి కూడా తోడైనా కేంద్రం దాదాపు అంటీముట్టనట్టుగానే వ్యవహరించింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత జరుగుతోన్న అపెక్స్ కమిటీ భేటీ కావడంతో ఆగస్టు 5కు ప్రాధాన్యం ఏర్పడింది.

  New National Education Policy 2020: 5+3+3+4 System, New Exams Pattern || Oneindia Telugu
  మరోసారి కేసీఆర్-జగన్ భేటీ?

  మరోసారి కేసీఆర్-జగన్ భేటీ?

  ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేయగా, తెలంగాణ చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, మిషన్‌ భగీరథ, నెట్టెంపాడు, భీమాలపై కేఆర్‌ఎంబికి, కాళేశ్వరం, తుపాకులగూడెం ప్రాజెక్టులపై ఏపీ సర్కారు గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. పేరుకు బోర్డులకు ఫిర్యాదుల మాట ఎలా ఉన్నా, జల వివాదాలను పరస్పర అంగీకారంతోనే పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని కేసీఆర్ పలు మార్లు కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. బీజేపీ నేతల లేఖల తర్వాతే, కేంద్రం ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ కు పిలుపునిచ్చినందుకే.. రెండు రాష్ట్రాలూ అజెండా అంశాలను కూడా పంపలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 5న జరగబోయే భేటీ తూతూమంత్రంగా సాగొచ్చని, కేసీఆర్ - జగన్ మరోసారి భేటీ అయి పరిష్కారాలకు ప్రయత్నించే అవకాశముందనే వాదన వినిపిస్తోంది.

  English summary
  Union Jal Shakti Ministry took a step to resolve water disputes between andhra pradesh and telangana. amid several complaint for both states, center called for an apex council meetion on august 5th. including jal shakti minister, kcr and jagan will participate on face time
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X