బాబు షాకింగ్: ఏపీ సచివాలయంలో ఆంధ్రజ్యోతి 'తెలంగాణ' ఆఫీస్?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో ఆంధ్రజ్యోతి బ్యూరో ఆఫీస్ పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పూర్తి కావడంతో ఏపీ అంతా హైదరాబాద్ నుంచి అక్కడకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

మరోవైపు, ఆంధ్రజ్యోతి హైదరాబాద్ కార్యాలయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. కార్యాలయంలో రిపేర్లు చేయాల్సి ఉంది. దీంతో ఆంధ్రజ్యోతి హైదరాబాద్ సిటీ, స్టేట్ రిపోర్టింగ్ బ్యూరో ఆఫీస్ పెట్టారని చెబుతున్నారు.

ఏం సంకేతాలు?: ఆంధ్రజ్యోతి ఆఫీసులో కెసిఆర్, రాధాకృష్ణతో సయోధ్య

ఆంధ్రజ్యోతి కార్యాలయంలో రిపేర్లు పూర్తయి, వెసులుబాటు దొరికే వరకు అక్కడే ఉండే అవకాశముందని అంటున్నారు. సచివాలయంలోని ఐ అండ్ పీఆర్ సెల్‌లో తాత్కాలిక కార్యాలయం పెట్టారంటున్నారు. అది పబ్లిసిటీ సెల్ కాబట్టి పెట్టుకోవచ్చునని కొందరు భావిస్తున్నారు.

అది పబ్లిసిటీ సెల్

అది పబ్లిసిటీ సెల్

అయితే, పబ్లిసిటీ సెల్ అంటే సచివాలయ వార్తలు తమ కార్యాలయాలకు పంపించుకోవడానికి జర్నలిస్టులకు కల్పించే ఓ సౌకర్యం ఇది. ఎక్కువగా సచివాలయం బీటు, ప్లస్ వివిధ శాఖల వార్తా వ్యవహారాలు చూసే కొందరు జర్నలిస్టులు దీనిని ఉపయోగించుకుంటారు.

సచివాలయంలో ఎలా

సచివాలయంలో ఎలా

అంతేతప్ప ఓ పత్రికా కార్యాలయం రిపోర్టింగ్ బ్యూరోనే ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడం సరైనది కాదని అంటున్నారు. నిజానికి ప్రభుత్వ కార్యాలయంలో, అదీ సచివాలయంలో ఓ పత్రికా రిపోర్టింగ్ ఆఫీస్ నడిపించడం సరికాదంటున్నారు.

ఏపీ సచివాలయంలో తెలంగాణ బ్యూరో..

ఏపీ సచివాలయంలో తెలంగాణ బ్యూరో..

మరో విషయం ఏమంటే.. అది ఏపీ సచివాలయం. నడిచేది మాత్రం ఆంధ్రజ్యోతి తెలంగాణ బ్యూరో. ఇలాంటి ఇబ్బందులే మరో పత్రికకు వస్తే ఈ అవకాశం కల్పిస్తారా అనే చర్చ కూడా సాగుతోంది.

జోనల్ కార్యాలయాలు ఉన్నాయిగా..

జోనల్ కార్యాలయాలు ఉన్నాయిగా..

ఆంధ్రజ్యోతి కార్యాలయం ప్రమాదానికి గురైంది. కాబట్టి నాలుగు రోజులు తాత్కాలికంగా ఉపయోగించుకొని వెళ్తారని అనేందుకు వీలు లేదంటున్నారు. ఎందుకంటే దానికి నగరంలో బోలెడు జోనల్ ఆఫీసులు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవచ్చు కదా అంటున్నారు.

కేసీఆర్.. చంద్రబాబు

కేసీఆర్.. చంద్రబాబు

కాగా, ఇప్పటికే కేసీఆర్ ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో కార్యాలయం పెట్టారని వార్త రావడం మరింత కలకలం రేపుతోంది. దీని ద్వారా రాధాకృష్ణ ఇరు రాష్ట్రాల సీఎంలకు ఎంతటి ఆప్తుడో అర్థమవుతోందంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhrajyothy Hyderabad buero in Andhra Pradesh secreariate?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి