టీడీపీ నేతలకు షాకిచ్చిన అంగన్వాడీలు.. దెబ్బకు పరారైన తెలుగుతమ్ముళ్ళు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత కొంతకాలంగా అంగన్వాడీలు ఏపీ ప్రభుత్వంపై సమర శంఖాన్ని పూరించి పోరాటం చేస్తున్నారు. అంగన్వాడీల జీతాలు పెంచుతామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా తాము వెనుకాడేది లేదని చెబుతున్న అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలకు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపి వారికోసం సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో అంగన్వాడీలకు మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఊహించని విధంగా అంగన్వాడీలు టిడిపి నేతలకు ఝలక్ ఇచ్చారు.

అమలాపురంలో టిఎన్టియుసి నేతలకు ఝలక్ ఇచ్చిన అంగన్వాడీలు తెలుగుదేశం పార్టీ నేతల మద్దతుతో అవసరం లేదని ముఖం మీద తేల్చి చెప్పారు. వారి మద్దతు తమకు అవసరం లేదని, గతంలో అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘనత మీదేనని తిరగబడిన అంగన్వాడి నాయకులు తమ పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం లేదన్నారు.
ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు వచ్చిన టిఎన్టియుసి నాయకులకు మొహం మీదే నో అన్న అంగన్వాడీలు..!!#AnganWadiWorkers #YSJaganGovt #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/SgtQlH2u60
— oneindiatelugu (@oneindiatelugu) January 13, 2024
అంగన్వాడీల రియాక్షన్ కు నివ్వెర పోయిన టిఎన్టియుసి నేతలు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కంగుతిన్న టిడిపి నాయకులు ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అంగన్వాడీల విషయంలో తెలుగుదేశం పార్టీ తమ విధానాన్ని తెలియజేసిందని, న్యాయమైన డిమాండ్లను తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామన్నారు.
టిడిపి నాయకులు వారికి సర్ది చెప్పి వారిని తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. అయినా సరే ఏమాత్రం వదిలిపెట్టిన అంగన్వాడీలు మీ మద్దతు మాకు అవసరం లేదని ముఖం మీద చెప్పారు. దీంతో బిక్కముఖం వేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడి నుండి వెళ్ళిపోయారు.












Click it and Unblock the Notifications