ఆనందయ్య మందుపై గుడ్‌న్యూస్- ఆయుష్ టెస్టుల్లో సత్ఫలితాలు-వారంలో ఫైనల్ రిపోర్ట్
నెల్లూరులో కోవిడ్ 19 చికిత్స కోసం ఆయుర్వేద వైద్యుడు బొనిగె ఆనందయ్య ఇస్తున్న మందుపై మరో సానుకూల ఫలితం పెలువడింది. ఆయుష్ అధికారులు ఈ మందులో వాడుతున్న సామాగ్రిపై నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయుష్ మంత్రిత్వశాఖకు ఈ ఫలితాలను పంపి ప్రభుత్వం అనుమతులు కోరబోతోంది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో ఇవాళ పరీక్షలు నిర్వహించారు. రాములు ఎదుట ఆనందయ్య తన మందు తయారీని చూపించబోతున్నారు. అంతకంటే ముందు ఇందులో వాడుతున్న మూలికలపై ఆయుష్ కమిషనర్ రాములు స్దానికంగా టెస్టులు నిర్వహించారు. ముత్తుకూరులో కొందమందితో, ఆనందయ్య వద్ద పనిచేసే వారితో మాట్లాడినట్లు రాములు తెలిపారు. ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పరిశీలిస్తామని రాములు వెల్లడించారు. మందు తయారీలో వాడే పదార్ధాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. మందు తయారీపై ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్టే వచ్చిందన్నారు.

ఆనందయ్య మందును తీసుకున్న వారి అభిప్రాయాలను కూడా ఆయుష్ కమిషనర్ తీసుకోనున్నారు. ఐసీఎంఆర్ బృందం పరిశీలన తర్వాత వారితో కూడా మాట్లాడి సమన్వయం చేసుకుంటామని ఆయుష్ కమిషనర్ తెలిపారు. మందు తయారీ అధ్యయనం తర్వాత తుది నివేదికకు వారం రోజులు పడుతుందన్నారు. అప్పటి వరకూ ఎవరూ కృష్ణపట్నం రావొద్దని నెల్లూరు అధికారులు కోరారు.
ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఐసీఎంఆర్, ఆయూష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నివేదిక తర్వాత ప్రభుత్వం అనుమతిస్తుందని, ఆ తర్వాతే మందు పంపిణీ ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications