నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ ! కీలక నేత గుడ్ బై..

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుుకుంటున్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన మూడు జిల్లాల్లో ఒకటైన నెల్లూరులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రెడ్ల ఆధిపత్యం ఉండే ఈ జిల్లాల్లో ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పుతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు పతాకస్ధాయికి చేరుతోంది.

another setback to ysrcp in nelllore district key leader leaves party

నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన కీలక నేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి గత ఎన్నికల్లోనే అసెంబ్లీ సీటు ఆశించారు. కానీ మేకపాటి కుటుంబానికి చంద్రశేఖర్ రెడ్డికి అక్కడ అవకాశం దక్కింది. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయనకు సీఎం జగన్ పోలీస హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. కొన్నేళ్లుగా ఈ పదవిలో ఉన్న ఆయన.. ఈసారి కూడా పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ దక్కకపోవడంతో వైసీపీని వీడారు.

another setback to ysrcp in nelllore district key leader leaves party

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి మెట్టుకూరు చిరంజీవి రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీకి, పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామాలు చేస్తూ లేఖలు పంపారు. తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలను ఆయన చూపారు. దీంతో మెట్టుకూరు చిరంజీవిరెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వైసీపీ గత ఎన్నికల ఫీట్ రిపీట్ చేసే అవకాశాలు లేవని తేలిపోయింది. ఈ క్రమంలోనే వేమిరెడ్డి ఎంట్రీతో కీలక నేతలంతా గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+