వైసిపిలో గెలిచి టిడిపిలోకి వెళ్లిన నేతలపై పోస్ట్: సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తోట రాజేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తోట రాజేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎమ్మెల్యే జయరాములు ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన రాజేష్‌ను పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు గుడివాడలో హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి పోలీసులమని చెప్పి ఐదుగురు వ్యక్తులు రాజేష్ ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేసి స్టేషన్‌కు రప్పించారు.
రాజేష్‌ను గుడివాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బద్వేలు తీసుకు వెళ్లారు. రాజేష్‌ను రహస్యంగా విచారిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఇంటూరి రవికిరణ్, రవీంద్ర ఇప్పాలలకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications