కోనసీమలో వైసీపీ సర్కార్ కు మరో టెన్షన్- రైతుల క్రాప్ హాలిడే-2011 తర్వాత ఇదే తొలిసారి
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో రైతుల సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. దీంతో విరక్తి చెందిన రైతులు ఈ ఏడాది పంటలు వేయకుండా క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుతో కోనసీమలోని 12 మండలాల రైతులు క్రాప్ హాలిడేకు సిద్ధమయ్యారు.

కోనసీమలో మరో క్రాప్ హాలిడే
కోనసీమ జిల్లాలోని 12 మండలాల్లో క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. గత నెలలో రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోక పోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు క్రాప్ హాలిడే కు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్న రైతులు.. ఈ మేరకు తాజాగా క్రాప్ హాలిడే తప్పనిసరిగా భావించారు. దీంతో వారు పంటలు వేయకూడదని తీర్మానాలు చేసుకుంటున్నారు.
Recommended Video


క్రాప్ హాలిడే వెనుక?
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం,ఎరువులు, సాగు ఖర్చులు పెరిగిపోయి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేక వర్షాకాలంలో పంట చేలు ముంపుకు గురవుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇప్పటికే ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తొలకరి పంట వేయకూడదని తీర్మానాలు చేసుకున్నారు.

2011 తర్వాత ఇదే
వరిసాగు గిట్టుబాటు కాక గతంలో 2011లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే పాటించారు. అయితే రైతు సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. అప్పటితో పోలిస్తే రైతుల సమస్యలు మరింతగా పెరిగాయి. దీంతో ఆగ్రహంగా ఉన్న రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా స్ధానిక అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విసిగిపోయిన కోనసీమ రైతులు మరోసారి క్రాప్ హాలిడే కు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తే వారు ఆలోచించే అవకాశాలూ లేకపోలేదు.

టీడీపీ కుట్రేనన్న విశ్వరూప్
క్రాప్ హాలిడే పేరుతో ప్రభుత్వంపై బురద చల్లడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోందని ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.కోనసీమ రైతులు ఎవరు కూడా ఏవిధమైన ప్రలోభాలకు లోనవ్వకుండా క్రాఫ్ హాలిడే ను ఖండించాలని మంత్రి విశ్వరూప్ పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో కనీసం సమావేశాలు కూడా ఏర్పాటు చూసుకొనివ్వలేదని, ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్న రైతు నాయకులందరూ కూడా టీడీపీ హయాంలో రోడ్డెక్కలేదని ఆయన విమర్శించారు. రైతులు రైతుల్లా ఉండాలి కాని పార్టీ కార్యకర్తల్లా ఉండకూడదని మంత్రి విశ్వరూప్ హితవు పలికారు.
కోనసీమ రైతులకు 24 గంటలలో ధాన్యం బకాయిలు చెల్లిస్తామన్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications