• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూన్ 20 నుండి ఏ పార్టీ నాయకుడైనా వైసీపీలో చేరొచ్చు కానీ వారికి మాత్రమే

|

ఏపీలో వైసీపీ పాలనలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఫిరాయింపుల విషయంలో ఒక స్టాండ్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో సంభాషించేటప్పుడు చాలా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

జూన్ 20 నుండి ఏ పార్టీ నాయకుడైనా వైయస్ఆర్సిపిలో చేరవచ్చని చెప్పిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

జూన్ 20 నుండి ఏ పార్టీ నాయకుడైనా వైయస్ఆర్సిపిలో చేరవచ్చని చెప్పిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

జూన్ 20 నుండి ఏ పార్టీ నాయకుడైనా వైయస్ఆర్సిపిలో చేరవచ్చు అని ఆయన ప్రకటించారు . అంతే కాదు వైసీపీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అంటూ పేర్కొన్నారు . అయితే, ఈ ఆఫర్ తాడిపత్రి నియోజకవర్గ నాయకులకు మాత్రమే అని చెప్తున్నారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి . ఇక ఈ నిర్ణయం అనంతపురం జిల్లాలో వైసిపిని బలోపేతం చేయడానికి అని తేల్చి చెప్తున్నారు ఎమ్మెల్యే పెద్దా రెడ్డి.

రాయలసీమపై పట్టు సాధించే యత్నంలో వైసీపీ

రాయలసీమపై పట్టు సాధించే యత్నంలో వైసీపీ

అనంతపురం జిల్లాలో వైయస్ఆర్సిపికి 2014 ఎన్నికలలో చాలా గట్టి ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న స్థానాలు గెలవలేకపోయింది., కానీ 2019 ఎన్నికలలో వైసీపీ గొప్ప పురోగతిని చూపించింది, మొత్తం 14 ఎమ్మెల్యే సీట్లలో 12 స్థానాలు కైవసం చేసుకుంది . ఇక జగన్ రాయలసీమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారని, నాలుగు జిల్లాలను వైసిపికి కంచుకోటలా ,బలంగా మార్చాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతాల మీద పట్టు సాధించాలంటే ఈ ప్రాంతాలను అభివృద్ధి చెయ్యటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేకుండా ఆయా ప్రాంతాల మీద పట్టు సాధించటం అని భావించి ఇలాంటి ఆఫర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది .

అనంత రాజకీయాల్లో టీడీపీ హవా తగ్గటంతో వలసలను ప్రోత్సహిస్తున్న వైసీపీ

అనంత రాజకీయాల్లో టీడీపీ హవా తగ్గటంతో వలసలను ప్రోత్సహిస్తున్న వైసీపీ

ఇక అనంత రాజకీయాల్లో టిడిపి యొక్క ఫైర్‌బ్రాండ్ నాయకుడు, జెసి దివాకర్ రెడ్డి, పరిటాల సునీతల మార్క్ వుంటుంది. కానీ ఈ ఎన్నికల్లోఓటమితో తాను రాజకీయాలను విడిచిపెడతానని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఇక పరిటాల సునీత కూడా ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఇక ఈ నేపధ్యంలో అనంతపురం జిల్లా మెడ పట్టు సాధించాలని వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగం గానే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తూ పిలుపునిస్తున్నారు. ఇక జేసీ రాజకీయాలకు గుడ్ బై పలకటంతో టీడీపీ ఈ ప్రాంతంలో తిరిగి ట్రాక్‌లోకి రావడం కాస్త ఇబ్బందికరమైన పని అని భావించొచ్చు .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP Thadipathri MLA Kethireddy Peddareddy made some highly intriguing comments while interacting with the media today“Any party leader can join in YSRCP from June 20th. The doors will always be open. However, this offer is just for leaders from Thadipathri constituency. This move is intended to strengthen YCP in Anantapur region,” he added.Well, YSRCP had a disastrous campaign from Anantapur district in 2014 elections, but showed great progress in 2019 elections, winning 12 out of the total 14 MLA seats.It is said that Jagan has set special focus on Rayalaseema region and is hoping to make the four districts a stronghold for YCP.With TDP’s firebrand leader, JC Diwakar Reddy announcing he will be quitting politics, it would be a daunting task for the yellow party to get back on track in this region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more