AP Assembly Results 2024: పిఠాపురంలో బంపర్ మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ దూకుడు!!

Pithapuram assembly election Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు వస్తున్న ఎన్నికల ఫలితాలలో కూటమి దూకుడును కొనసాగిస్తుంది. మరోవైపు దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ దూకుడు కొనసాగిస్తున్నారు. ఇటు పోస్టల్ బ్యాలెట్ లోను పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు.

పిఠాపురంలో బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్?
వంగ గీత, పవన్ కళ్యాణ్ ఫోటో పోటీగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించి హోరాహోరీగా తలపడ్డారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోర ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం లో బంపర్ మెజారిటీతో గెలుస్తారని ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పాటు, ప్రజల్లోను చాలా బలమైన విశ్వాసం ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల్లో దూకుడు కొనసాగిస్తున్నారు.

AP Assembly Election 2024 Results Pawan kalyan Leading in Pithapuram

పిఠాపురంలో రెండో రౌండ్ ముగిసేసరికి పవన్ ఆధిక్యత
పిఠాపురం పోస్టల్ బ్యాలెట్‌లో ఎక్కువ చెల్లని ఓట్లు ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్‌కు 1,000 ఓట్లు లీడ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండో రౌండ్ ముగిసిన తర్వాత పవన్ 7,500 ఓట్ల లీడ్‌లో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు తెనాలిలో నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. ఈసారి జనసేన అభ్యర్థులు కూడా అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తారని జనసేన పార్టీ నేతలు చాలా బలమైన విశ్వాసంతో ఉన్నారు.

ముందంజలో టీడీపీ అభ్యర్థులు
ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ , రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు.TDP అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.రెండో రౌండ్‌ ముగిసే సరికి తన సమీప ప్రత్యర్థి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై బుచ్చయ్య 2870 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో 1300 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు, పారా మిలటరీ బలగాలు భారీగా మోహరించారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తిస్థాయి ఆంక్షలు విధించడంతో పాటు, 144 సెక్షన్‌ను అమలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+