కాల్ మనీ నిందితులతో జగన్, చంద్రబాబు!: రెచ్చిపోయిన రోజా (పిక్చర్స్)

హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. లోటస్ పాండ్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరి ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు.

పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పైన చర్చను తప్పించుకునేందుకు నిన్న సమావేశాల్లో ప్రభుత్వం అంబేద్కర్ పేరును ప్రస్తావించిందని ఆరోపించారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో పాత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను కాపాడుకునేందుకే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయిస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరు కొనసాగిస్తామన్నారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయలుదేరారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్తంభించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకాగానే కాల్‌మనీ వ్యవహారంపై వెంటనే చర్చ జరగాలని వైకాపా సభ్యులు పట్టుబట్టి కార్యకలాపాలను అడ్డుకున్నారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

ఈ క్రమంలో వైసిపికి చెందిన ఇద్దరు సభ్యులను రెండు రోజులపాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు సభాపతి కోడెల శివప్రసాద రావు ప్రకటించారు. మరోవైపు కాల్‌మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రకటన చేసే అవకాశముంది.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

కాల్‌మనీ కేసుల్లో నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని, ఎవరు తప్పుచేసినా, చట్టాన్ని ఉల్లంఘించినా తప్పించుకోలేరని, సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వవచ్చనని, ఏ పార్టీ వారైనా, ఎంత పలుకుబడి కలిగిన వారైనా శిక్షించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందనిగ చంద్రబాబు స్పష్టం చేశారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

అంతకుముందు జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశంలో ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతిపై చర్చ చేపట్టాలని నిర్ణయించినా, అది జరగలేదు. వైసిపి సభ్యులు రోజా, ఇతరులు రుణాలు మానవ హక్కుల ఉల్లంఘనలపై ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులు స్పీకర్ తిరస్కరించారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

దీంతో వైసిపి సభ్యులు పోడియం వద్దకు చేరుకుని కాల్‌మనీ వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. కాల్‌మనీ చంద్రబాబు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ప్రభుత్వం శుక్రవారం ఉదయం ప్రకటన చేస్తుందన్నారు. ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధం కావాలన్నారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

అయినా వైసిపి సభ్యుల నుంచి సానుకూలత కనిపించలేదు. ప్రతిపక్ష నేత జగన్‌ మాట్లాడుతూ... దోషులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలు దిగారని, నిఘావర్గాల వారితో దోషులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో నిందితులు విదేశీ పర్యటనలకు వెళ్తూ అక్కడే ఉంటున్నారని అన్నారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

ఎమ్మెల్సీ సోదరుడు సైతం ఈ ఉదంతంలో ఉన్నారని చెప్పారు. అందుకు సంబంధించిన పేపర్‌ క్లిప్పింగ్స్‌ను, ప్లకార్డులను చూపించారు. టిడిపి సభ్యులు కూడా నిందితులతో జగన్‌ ఉన్న ఫొటో క్లిప్పింగ్స్‌ను చూపించారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

మంత్రి రావెల కిషోర్ మాట్లాడుతూ... ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ 125 జయంతి ఉత్సవాలపై మాట్లాడాలని నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు. గందరగోళం నెలకొనడంతో సభాపతి సభను పది నిముషాలపాటు వాయిదా వేశారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

అనంతరం ప్రారంభమైన సభలో... వైసిపి సభ్యులు కాల్‌మనీ వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. తిరస్కరించిన అంశంపై మాట్లాడడం తగదని స్పీకర్ పేర్కొన్నారు.

 గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

జగన్‌ స్పందిస్తూ... అంబేడ్కర్‌నూ రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, ఆయన ఆత్మ క్షోభకు గురవుతుందని వ్యాఖ్యానించారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

మంత్రి యనమల మాట్లాడుతూ.. పార్లమెంటులో అంబేడ్కర్‌పై రెండు రోజుల పాటు చర్చ జరిగిందని, దాని ప్రాధాన్యతను వైసిపి గుర్తించకపోవడం తగదన్నారు. 11 ఛార్జిషీట్లతో నిందితుడుగా ఉన్న వ్యక్తి సభలోనే ఉన్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

ప్రశ్నోత్తరాల కార్యక్రమంలోని ప్రశ్నలకు జవాబులు చెప్పినట్లుగానే భావించాలని ఇదే సందర్భంగా స్పీకర్ చెప్పారు. వైసిపి సభ్యులు పోడియంలోకి వెళ్లి సభా కార్యక్రమాలు అడ్డుకోవడంపై స్పీకర్ పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

వైసిపి సభ్యుడు డి రాజాను ఉద్దేశించి.. తొలిసారిగా శాసనసభ్యుడైన రాజా ప్రవర్తన మార్చుకోకుండా ఉంటే నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందగని హెచ్చరించారు. బీఏసీలో నిర్ణయం మేరకైనా ఒక రోజు ఆగాలని సూచించినా వైసిపి సభ్యులు వెనక్కితగ్గలేదు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

చీఫ్‌విప్‌ కాల్వశ్రీనివాసులు మాట్లాడుతూ.... వైసిపి సభ్యులు బీఎసీలో నిర్ణయించిన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

వైసిపి సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.... కాల్‌మనీ వ్యవహారంపై మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

సభా కార్యక్రమాల ప్రసారాలకు అడ్డుపడిన ఇద్దరు నైసిపి సభ్యులు ఆర్ శివప్రసాద్ రెడ్డి, డి రామలింగేశ్వర రావు (రాజా)ను రెండు రోజులపాటు సస్పెండ్‌ చేశారు.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

అనంతరం అంబేడ్కర్‌పై ముఖ్యమంత్రి చర్చ ప్రారంభిస్తారని ప్రకటించారు. సీఎం చంద్రబాబు లేచి మాట్లాడబోతుండగా.. వైసిపి సభ్యులు పోడియంలోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో మరోసారి వాయిదా పడింది.

గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

మళ్లీ సభ ప్రారంభం కాగానే... అంబేడ్కర్‌పై చర్చకు సభాపతి అనుమతించారు. ఆయన సూచనపై చంద్రబాబు మాట్లాడేందుకు నిలబడగానే ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మినహా వైసిపి సభ్యులందరూ పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.

 గురువారం ఏపీ అసెంబ్లీ

గురువారం ఏపీ అసెంబ్లీ

నినాదాల మధ్యనే సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పార్లమెంట్‌లో చర్చ జరిగింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+