వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమల్లోకి ఆన్ లైన్ టికెట్లు-ఒకటే రేటు-వాహనాల పన్నుల మోత- రెండు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

|
Google Oneindia TeluguNews

ఏపీలో రెండు కీలక చట్టాలకు సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. ఇందులో ఒకటి సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు కాగా.. మరొకటి మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు. రాష్ట్రంలో సినిమా టికెట్ల అమ్మకాలకు ఉద్దేశించిన సవరణల్ని సినిమాటోగ్రఫీ చట్టంలో చేపడుతూ రూపొందించిన బిల్లుతో పాటు మోటారు వాహనాల పన్నుల్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ రెండు బిల్లుల్ని రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం ఆమోదం పొందాయి.

 రెండు కీలక బిల్లులు

రెండు కీలక బిల్లులు

ఏపీ అసెంబ్లీలో రెండు కీలక బిల్లుల్ని ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ కాగా.. మరొకటి ఏపీ మోటారు వాహనాల చట్టానికి సవరణ చేస్తూ రూపొందించిన బిల్లు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న రెండు నిర్ణయాల కారణంగా ఇప్పటికే ఉన్న రెండు చట్టాల్లో సవరణలు చేస్తూ ఈ రెండు బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దీంతో రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని ఈ రెండు బిల్లుల్ని శాసన సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వీటిపై చర్చ జరిగింది.

 ఆన్ లైన్ సినిమా టికెట్లు

ఆన్ లైన్ సినిమా టికెట్లు

రాష్ట్రంలో ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయాల కోసం సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని .. అనంతరం దీనిపై సభలో మాట్లాడారు. సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారాజ్యంగా ఆరేడు వేస్తున్నారని, బెనిఫిట్ షోల పేరిట 500- 1000 రూపాయల వరకూ టికెట్ ధరలు పెట్టి వసూలు చేస్తున్నారని మంత్రి పేర్నినాని ఆరోపించారు. ఏ చట్టం మమ్మలను ఆపగలదన్న ధీమా కొందరు వ్యక్తం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఏ చట్టమైనా తమకు అనుకూలంగా ఉండాలని కొందరు భావిస్తున్నారని నాని తెలిపారు. ప్రస్తుతం సినిమాహాళ్లలో జరుగుతున్న వ్యవహారాలను ఆన్ లైన్ టికెట్ ప్రక్రియ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చని పేర్ని తెలిపారు.

 మారనున్న సినిమా

మారనున్న సినిమా

ఇక పై ప్రభుత్వం చెప్పిన సమయానికి మాత్రమే సినిమాను ప్రదర్శించాలని మంత్రి పేర్నినాని తెలిపారు. ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడే టికెట్ ధరలు నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. బస్సు , రైలు టికెట్లు, విమాన టికెట్ల తరహాలోనే ఇంటి వద్ద నుంచే సినిమా టికెట్లనూ ఆన్ లైన్ లో కొనుగోలు చేసే వీలు కల్పిస్తామన్నారు. కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వచ్చిన కలెక్షన్లకూ, జీఎస్టీ చెల్లింపులకు పొంతన లేదన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు యథావిధిగా ఆన్ లైన్ విధానం ద్వారా వస్తాయని మంత్రి పేర్ని తెలిపారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి సినిమా వాళ్లు ప్రయత్నిస్తే అర్ధముంది కానీ రాజకీయ పార్టీలకెందుకని ఆయన ప్రశ్నించారు. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై డిస్ట్రిబ్యూటర్లకూ నిర్మాతలకు లేని అభ్యంతరం ఇతరులకెందుకని నాని ప్రశ్నించారు. కొందరు సినిమాహాళ్ల రాబడులు చూపించి అప్పులు తీసుకుంటామని నిందలు వేస్తున్నారని ఆక్షేపించారు. ఆన్ లైన్ పోర్టల్ ను ఏపీ ఫిలిండెవల్పమెంట్ కార్పోరేషన్ నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. ఆర్బీఐ గేట్ వే ద్వారా ఏరోజుకారోజు సినిమాహాళ్లకు డబ్బులు చెల్లింపులు చేస్తామన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలందించే చట్టమని, కాబట్టి అందరూ మద్దతు ఇవ్వాలని పేర్ని కోరారు.

 వాహనాల చట్ట సవరణ

వాహనాల చట్ట సవరణ

ఇదే క్రమంలో మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లును కూడా శాసనసభలో రవాణాశాఖ మంత్రి పేర్నినాని

ప్రవేశపెట్టారు. పర్యావరణం కోసమే పన్నులు పెంచుతున్నామని మంత్రి పేర్ని తెలిపారు పర్యావరణాన్ని రక్షించేందుకు , అధిక కర్బనాలను విడుదల చేసే పాత వాహనాలను నిరుత్సాహపరిచేందుకు ఈ చట్ట సవరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మోటారు వాహనాల పన్నులు పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి గుర్తుచేశారు. గ్రీన్ ట్యాక్స్ పేరిట ఈ పన్నులు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.

 వాహనాలపై పన్ను పోటు ఇలా

వాహనాలపై పన్ను పోటు ఇలా

పదేళ్లలోపు వాహనాలు, 12 ఏళ్లు మించిన వాహనాలు, రవాణా, రవాణేతర వాహనాలు, ఏడు నుంచి 10 ఏళ్లలోపు వాహనాలు 4 వేల రూపాయలు చెల్లించాలని, 12 ఏళ్లు దాటితే 6 వేల రూపాయల గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పర్యావరణ హితం కోసం గ్రీన్ ట్యాక్స్ ను అదనంగా విధించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నూతన వాహనాల విక్రయించినప్పుడు కూడా పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 20 లక్షల రూపాయల పైబడిన వాహనాలపై 18 శాతం వరకూ పన్ను విధించనున్నారు. అదనంగా 4 శాతం పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఐదు లక్షల లోపు ఉన్న వాహనాలకు 1 శాతం మాత్రమే పన్ను పెంపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. 10 లక్షలపైబడిన వాహనాలకు 3 శాతం పన్ను అదనంగా విధించాలని చట్టంలో మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

English summary
andhrapradesh legislative assembly have passed two key bills today intended to promote online cinema ticket sales and hike of motor vehicles taxes in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X