Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 19 నుండి .. ఈ సెషన్ లోనే 2021-2022 బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అంతేకాదు ఈ సమావేశాలకు సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది ఏపీ సర్కార్. ఇక ఈ సమావేశాల్లోనే 2021-2022 బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనుంది.

మార్చి 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

 AP Assembly session from March 19. ..Budget 2021-2022 in this session

ఇక ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించింది. అయితే ఇప్పటికే మహిళా దినోత్సవం రోజున సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా జెండర్ బడ్జెట్ ను ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కొత్తగా జండర్ బడ్జెట్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక మార్చి 19వ తేదీన విడుదలయ్యే అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలున్నాయి.

అసెంబ్లీ సమావేశాలకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఈ సమావేశాలలో రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై, అలాగే అనేక ప్రజా సమస్యలపై అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తుంటే, ఈ సమావేశంలో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+