కబడ్డీ ఆడుతూ బొక్క బోర్తా పడ్డ స్పీకర్ తమ్మినేని- సీఎం కప్ టోర్నీలో ఘటన
నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన వ్యాఖ్యలతో కాకుండా తన చేష్టలతో వార్తల్లో నిలవడం విశేషం. శ్రీకాకుళం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో జరుగుతున్న సీఎం కప్ టోర్నీ ఇందుకు వేదికైంది.
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసతో ఇవాళ సీఎం కప్ కబడ్డీ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో స్ధానిక క్రీడాకారులు పాల్గొంటున్నారు. అందులో అసంబ్లీ స్పీకర్ కమ్ స్ధానిక ఎమ్మెల్యే కూడా అయిన తమ్మినేని సీతారాంను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. దీంతో టోర్నీకి హాజరైన తమ్మినేని. .. కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నదే తడవుగా కబడ్డీ కోర్టులోకి దిగారు. కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతపెడుతూ ప్రత్యర్ధి క్రీడాకారుల్ని కవ్విస్తున్నారు. అక్కడే బిగ్ ట్విస్ట్ ఎదురైంది.

కబడ్డీ ఆడుతుండగా.. స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయారు. దాదాపు పది అడుగుల దూరంలో పడిపోయారు. దీంతో వెంటనే కంగారుపడ్డ క్రీడాకారులు, అధికారులు ఆయన్ను లేపి ప్రాధమిక చికిత్స అందించారు. అయితే ఆ తర్వాత వెంటనే కోలుకున్న స్పీకర్ తమ్మినేని తిరిగి కబడ్డీ ఆట కొనసాగించడం విశేషం. ఆటల్లో ఇవన్నీ మామూలే అంటూ క్రీడాకారుల్ని ఉత్సాహపరుస్తూ తమ్మినేని కబడ్డీ కొనసాగించడంతో క్రీడాకారులు కూడా ఉత్సాహంగా ఆయనతో కలిసి ఆడారు. ఆ తర్వాత రెగ్యులర్ మ్యాచ్ కొనసాగింది.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసతో ప్రభుత్వం తరఫున నిర్వహించే ప్రతీ కార్యక్రమంలోనూ తమ్మినేని పాల్గొంటుంటారు. స్పీకర్ అయినా ఎలాంటి మొహమాటం లేకుండా సొంత పార్టీ వైసీపీకి అనుకూలంగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటారు. స్పీకర్ కంటే ముందు తాను వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అంటూ వాటిని సమర్ధించుకుంటూ ఉంటారు కూడా. అయినా రాజకీయాల్లో సీనియర్ కావడంతో ఆయన్ను జిల్లాలో మిగతా నేతలు కూడా అదే గౌరవంతో చూస్తుంటారు.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications