• search
 • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సమగ్రమైన బిల్లుతో మళ్లీ ముందుకొస్తాం- రాజధాని బిల్లులు అసెంబ్లీలో ఉప సంహరణ : సీఎం జగన్ ప్రకటన..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన అసెంబ్లీలో ప్రకటన చేసారు. ఈ ప్రాంతం అంటే తనకు ఎటువంటి వ్యతిరేకత లేదని సీఎం స్పష్టం చేసారు. తనకు ప్రేమ కూడా అని వెల్లడించారు. మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే..దాని నుంచి మంచి ఫలితాలు అందుబాటులోకి వచ్చి ఉండేవని..నాటి శ్రీబాగ్ ఒడంబడిక తో ఉత్తరాంధ్రతో సహా అన్ని ప్రాంతాల డెవలప్ కోసం వికేంద్రీకరణ బిల్లును ప్రవేశ పెట్టాం. గతంలో ఒక్క చోటే కేంద్రీకరణ ధోరణితో ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో..2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా స్పష్టమైంది. హైదారాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్..ఒకే చోట ఏర్పాటు సరికాదని నమ్మి అడుగులు వేసామని జగన్ చెప్పారు.

అందరి ఆకాంక్ష్లాలను పరిగణలోకి తీసుకొనే ఈ నిర్ణయం

అందరి ఆకాంక్ష్లాలను పరిగణలోకి తీసుకొనే ఈ నిర్ణయం

అన్ని ప్రాంతాలు..అన్ని కులాలు..అన్ని మతాల ఆశల...ఆకాంక్షలు పరిగణలోకి తీసుకోవటం వలనే అన్ని ఎన్నికల్లో మనసారా దీవిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అనేక అపోహలు..అనుమానాలు..కోర్టు కేసులు..న్యాయ పరమైన వివాదాలు..దుష్ఫ్రచారాలు చేసారు. కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదన కూడా తీసుకొచ్చారని గుర్తు చేసారు. ఈ నేప్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని ..మూడు రాజధానుల బిల్లుల ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు..చట్ట - న్యాయ పరంగా బిల్లులోనే పొందు పరిచేందుకు.. బిల్లును మరింత పెరుగు పరిచేందుకు..అన్ని ప్రాంతాలకు..అందరికీ విస్త్రుతంగా వివరించేందుకు..అవసరమైన మార్పులు పొందు పరిచేందుకు గత బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకొని..మళ్లీ పూర్తి సమగ్రమైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని సీఎం జగన్ స్పష్టం చేసారు.

అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు చేయాలి

అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు చేయాలి

అమరావతి ప్రాంతంలో మౌళిక సదుపాయాల కోసమే ఖర్చు లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రజలను తప్పు దోవ పట్టించటం సరైనదేనా. రాష్ట్రంలో ఉన్న పెద్ద నగరం విశాఖ అని..అక్కడ అన్ని సౌకర్యాల పైన కొంత ఖర్చు చేస్తే రానున్న కాలంలో హైదరాబాద్ లాంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంటుందని చెప్పారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించామని వివరించారు. రకరకాలుగా దీనిని వక్రీకరించారు. అపోహలు క్రియేట్ చేసారు. న్యాయపరమైన చిక్కులు తెచ్చారని చెప్పారు.

అసెంబ్లీలో బిల్లుల ఉప సంహరణ

అసెంబ్లీలో బిల్లుల ఉప సంహరణ

అదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ ద్వారా హైకోర్టుకు నివేదించారు. ఇక, అసెంబ్లీలో రాజధానుల బిల్లుతో పాటుగా..సీఆర్డీఏ రద్దు చట్టం బిల్లులను ప్రభుత్వం ఉప సంహరించుకుంది. ఆర్దిక మంత్రి బుగ్గన ఈ బిల్లుల ఉపసంహరణ ప్రతిపాదన చేసారు. ఆ సమయంలో ఈ బిల్లు వెనుక నేపథ్యం వివరించారు. రాష్ట్ర విభజన తరువాత శ్రీక్రిష్ణ కమిటీ నివేదిక... శివరామక్రిష్ణన్ రిపోర్టు గురించి చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో విభజన వాదం రాకుంటే వికేంద్రీకరణ కావాలని ఆయన స్పష్టం చేసిన అంశాన్ని బుగ్గన గుర్తు చేసారు. ఇతర రాష్ట్రాల్లో సైతం వికేంద్రీకరణ కారణంగా డెవలప్ అయ్యాయంటూ వివరించారు. హైదరాబాద్ లోనే మొత్తం సంస్థలను కేంద్రీకరించటం వలన రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు.

  Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu
  మూడు రాజధానుల ఎంపిక వెనుక

  మూడు రాజధానుల ఎంపిక వెనుక


  చంద్రబాబు ఊహాజనిత రాజధాని గురించి పదే పదే చెప్పుకొచ్చారని మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు. 33వేల ఎకరాలను అమాయకుల నుంచి చంద్రబాబు సేకరించారు. 50 వేల ఎకరాల భూమిని వాడకంలోకి తెచ్చుకుంటామని చెబుతూ వచ్చారని గుర్తు చేసారు. బోస్టన్ గ్రూపు ఇచ్చిన నివేదికలో అన్ని అంశాలపైన స్పష్టం చేసారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత హైపవర్ కమిటీ ఏర్పాటు చేసామని వివరించారు. ప్రత్యేక జోనల్ బోర్డులు ఏర్పాటు చేస్తూ..రాజ్యంగా పరమైన విధుల కోసం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఎంపిక చేసామన్నారు. అయితే, రాజకీయాలు..ప్రాంతీయ తత్వం తీసుకొచ్చి.. అమాయకులను రెచ్చగొడుతూ.. రైతుల ముసుగులో కొందరు నటిస్తున్నారంటూ బుగ్గన చెప్పుకొచ్చారు. అభ్యంతరం ఉన్న వారిని సమాధాన పరుస్తూ ముందుకెళ్లాలని నిర్ణయించామని బుగ్గన వెల్లడించారు. వంద శాతం ఏకాభిప్రాయం తీసుకొచ్చి..అందరం కలిసి మెలిసి ఉండాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేసారు. వికేంద్రీకరణ ఖచ్చితంగా చేసుకుంటూ..అందరినీ భాగస్వాములను చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు.

  English summary
  AP CM Jagan made a clear statement in the assembly that the govt would be withdrawing the bill on three capitals.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X