ట్యూషన్ చెప్తా: జగన్, నువ్వలా చేశావేంటి: బాబు హెచ్చరిక(పిక్చర్స్)

హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదాకు అర్హమైందని, పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.

పొరుగు రాష్ట్రాలతో సమాన సామర్థ్యం పొందే వరకు కేంద్రం తోడ్పాడు విజ్ఞప్తి చేస్తున్నానని, భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉదయం చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వైసిపి ప్లకార్డులు ప్రదర్శిస్తూ వచ్చింది.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

ప్రత్యేక హోదా అంశంపైనే రాష్ట్ర భవిష్యత్, భావితరాల భవిష్యత్ కూడా ఆధారపడి ఉందని, ఇది చాలా ముఖ్యమైన అంశమని అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

ప్రత్యేక హోదాపై శాసనసభలో సోమవారం నిర్వహించిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. విభజన చట్టంలో హామీలను అమలు చేయించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి దాపరికం లేదన్నారు. అయితే ప్రస్తుత స్థితికి కారణంగా విభజనకు ముందు, తర్వాత పరిణామాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదని, కాని వైకాపా మాత్రం రాజకీయ ప్రయోజనాలకు పోయిందని ఆరోపించారు. ఆనాడు యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుందన్నారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

రాష్ట్రంలో పరిస్థితులపై తాము ఆనాడు రాష్టప్రతికి కూడా లేఖ రాశామని, 43 ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్టుకు రిఫర్ చేసి, రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా చూడమని కోరామని, ఇన్ని ప్రయత్నాలు చేసినా, రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని, విభజన ఇష్టారాజ్యంగా చేయడం వల్ల కొన్ని అంశాలకు చట్టబద్ధత లేకుండా పోయిందన్నారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారు ధైర్యంగా ఉండేందుకు సభ ద్వారా వారికి భరోసా ఇవ్వాల్సి ఉందన్నారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని తొలి నుండి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సమైక్యంగా ఉండాలంటే తెలంగాణకు న్యాయం చేయమని కోరామని, విడిపోయిన పక్షంలో ఆంధ్రాకు న్యాయం చేయమని కోరామన్నారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వార్‌రూమ్ సృష్టించి, కాంగ్రెస్ వాళ్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిందే తప్ప ఆంధ్రాకు న్యాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన నష్టంపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఆర్టికల్ 3ని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తింపచేసిందని, బిహార్ అసెంబ్లీ ఆనాడు రాష్టవ్రిభజనకు నో చెబితే మళ్లీ అసెంబ్లీ తీర్మానం అయ్యేంత వరకూ కేంద్రం వేచి చూసిందని, కాని ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగలేదన్నారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకున్నట్టు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై వైసిపి సభ్యుల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం ఉదయానికి వాయిదా పడింది.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తున్న సమయంలోనే వైసిపి అడ్డు తగిలింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి బిగ్గరగా నినాదాలు చేశారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారంటూ వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ... సభా నాయకుడి ప్రసంగానికి అడ్డుతగలడం సభామర్యాద కాదన్నారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

సభా నేత ప్రకటన చేస్తున్నపుడు మధ్యలో ప్రశ్నలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావుతోపాటు మంత్రులు యనమల, అచ్చన్నాయుడు వైసిపి సభ్యులను వారించే ప్రయత్నం చేశారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగేలా సహకరించాలని కోరారు. అయినా వైసిపి సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు గందరగోళంపై సిఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌కు హెచ్చరిక చేశారు. నేను విఐపి ఘాట్లో స్నానం చేయలేదని ప్రశ్నిస్తోన్న జగన్ అలా ఎందుకు చేయలేదని కౌంటర్ ఇచ్చారు. జగన్ గీత దాటితే ఊరుకునేది లేదన్నారు.

 అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు

సోమవారం సభ వాయిదా పడిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై మంగళవారం సభలో ముఖ్యమంత్రి మాట్లాడాక తమకు సమయం ఇవ్వాల్సిందేనని, అప్పుడు హోదా రాకపోతే జరిగే నష్టం, వస్తే కలిగే ఉపయోగాల గురించి సిఎం, స్పీకర్‌కు ట్యూషన్ చెబుతానని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+