పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్‌తో చెక్?: ఏపీలో పాగా కోసం బిజెపి పావులు??

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పొలిటికల్ సర్కిల్, వెబ్ మీడియాలో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఏపీ బీజేపీ నాయకులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

2014లో పవన్ కళ్యాణ్ బిజెపి - టిడిపిలకు మద్దతు పలికారు. ప్రత్యేక హోదా అనే పాయింట్ మీద మద్దతిచ్చిన పవన్.. ఆ తర్వాత అదే అంశంపై బిజెపిని నిలదీస్తున్నారు. బిజెపి హోదా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పవన్ ఆ పార్టీపై ఫైట్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ మద్దతు కోరిందని..

అల్లు అర్జున్ మద్దతు కోరిందని..

మరోవైపు, బిజెపి ఏపీలో ఎదిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ బిజెపి నేతలు అల్లు అర్జున్ మద్దతును కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. వారి ప్రయత్నాలు ఫలించలేదని కూడా అంటున్నారు.

బిజెపి తారలకు గాలం వేస్తోంది..

బిజెపి తారలకు గాలం వేస్తోంది..

అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనను అభిమానులు స్టైలిష్ స్టార్ అంటారు. అతను ఎప్పుడు కూడా రాజకీయాలపై దృష్టి సారించలేదు. సినిమాల పైనే దృష్టి అంతా. అలాంటి అల్లు అర్జున్ కోసం బిజెపి ప్రయత్నించిందనే వార్తలు రావడం గమనార్హం. అయితే, ఇటీవలి కాలంలో ఆయా రాష్ట్రాల్లో ఎదిగేందుకు బిజెపి సినిమా తారలకు కూడా గాలం వేస్తోంది. ఇందులో భాగంగా అల్లు అర్జున్‌ను కూడా సంప్రదించి ఉంటారని అంటున్నారు.

ఎటు చూసినా అల్ల అర్జున్ మద్దతు కష్టమే

ఎటు చూసినా అల్ల అర్జున్ మద్దతు కష్టమే

అల్లు అర్జున్‌కు ఇంకా సినిమాల్లో ఎంతో కెరీర్ ఉంది. అలాంటి వ్యక్తి ఓ పార్టీ వాడిగా ముద్రపడిపోవడానికి ఇష్టపడడని చెప్పవచ్చు. మరోవైపు, హోదా కోసమే పవన్ కళ్యాణ్ బిజెపికి దూరమయ్యాడు. అలాంటప్పుడు అదే ఇవ్వని బిజెపికి అల్లు అర్జున్ మద్దతు ఎలా ఇస్తారనేది ప్రశ్నే. ఇక, పవన్ కళ్యాణ్‌కు ఆగ్రహం కలిగించే పనులు అల్లు అర్జున్ ఎందుకు చేస్తారని మెగా అభిమానులు అంటున్నారు.

బిజెపి నేత ధృవీకరించాడని..

బిజెపి నేత ధృవీకరించాడని..

ఈ మేరకు ఓ బిజెపి నేత స్పందించినట్లుగా కూడా వార్తలు వస్తున్నయి. అల్లు అర్జున్‌కు సొంతగా ఇమేజ్ ఉందని, ఆయనను తాము సంప్రదించామని, ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఇప్పుడు రావడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించినట్లుగా వెబ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కాగా, అల్లు అర్జున్‌ను కలవడం నిజమయితే.. 019లో పవన్‌కు అల్లు అర్జున్‌తో చెక్ పెట్టే విధంగా బిజెపి పావులు కదపాలని భావించి ఉండవచ్చునని, కానీ కుదిరేపని కాదంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Telugu Media House has reported an interesting item. The report said AP BJP which has lost its hope on Pawan Kalyan’s Support in 2019 is keen on having one more actor on board for the party. A leader of the saffron party confirmed to have contacted Allu Arjun for his support.
Please Wait while comments are loading...