ఏపీ మద్యం షాపుల వద్ద డ్రాపింగ్ వ్యాన్లు-సర్కార్ కు బీజేపీ నేత సలహా..!
ఏపీలో కొత్తగా ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ఇందుకు తగినట్లుగానే మద్యం షాపుల్ని లాటరీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. అంతే కాదు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మద్యం షాపుల్ని, వాటిలో నాసిరకం బ్రాండ్లను కూడా తొలగించింది. వీటి స్ధానంలో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటితో పాటు మరో చర్య కూడా తీసుకోవాలని బీజేపీ నేత ఒకరు ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానంపై స్పందిస్తూ ప్రజారోగ్యానికి హాని అని తెలిసినా తప్పడం లేదంటూ బీజేపీ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా నేత కీర్తి రాంప్రసాద్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రతీ మద్యం షాపు వద్ద, బార్ వద్ద డ్రాపింగ్ వ్యాన్లు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మద్యం సేవించిన వారికి ఉచితంగా ఇంటి వద్దే డ్రాప్ చేసేందుకు వీలుగా ఈ వ్యాన్లు ఏర్పాటు చేయాలని కీర్తి రాంప్రసాద్ కోరారు.

ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా బీజేపీ నేత కీర్తి రాంప్రసాద్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి రూపంలో కూడా ఇచ్చారు. డ్రాపింగ్ వ్యాన్స్ ఏర్పాటుతో రోడ్లపై మందుబాబులతో ఇబ్బందులు ఉండవని ఆయన చెప్తున్నారు. ఆయన వినతిని కలెక్టర్ వెట్రిసెల్వి ప్రభుత్వానికి పంపుతామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇలా మద్యం షాపుల దగ్గర ఉచితంగా డ్రాపింగ్ వ్యాన్స్ పెట్టాలన్న బీజేపీ నేత డిమాండ్ పై మిశ్రమ స్పందన వస్తోంది.












Click it and Unblock the Notifications