కేసీఆర్ హిట్లర్- కడుపు మంటతోనే ఆ పని-చరిత్ర క్షమించదన్న ఏపీ బీజేపీ నేత విష్ణు
ఏపీ, తెలంగాణ మధ్య సాగుతున్న జల యుద్ధం పతాక స్ధాయికి చేరింది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ నిర్మాణంపై అభ్యంతరాలతో మొదలైన ఈ వార్ ఆ తర్వాత ప్రాజెక్టుల్లో అక్రమంగా జల విద్యుత్ ఉత్పత్తి వరకూ వెళ్లింది. దీనిపై ఇరు ప్రభుత్వాలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్నీ, సీఎం కేసీఆర్ ను ఉద్దశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రా రైతులపై కడుపు మంటతో ఉద్దేశపూర్వకంగా నీళ్లను సముద్రంలోకి పంపించిన చరిత్ర మీకు మాత్రమే దక్కుతుంది కేసిఆర్ @TelanganaCMO దోర గారు.
— S.Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 3, 2021
పులిచింతలలో తెలంగాణ జెన్కో అసందర్భంగా, దౌర్జన్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన కారణంగా 7,400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తోంది.దీంతో (1/3) pic.twitter.com/dcKjBu6Ba4
తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి కోసం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడాన్ని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలో వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలిపిపోయిందన్నారు. అంతటితో ఆగకుండా ఆంధ్రా రైతులపై కడుపు మంటతో ఉద్దశపూర్వకంగా నీళ్లను సముద్రంలోకి పంపించిన చరిత్ర మీకు మాత్రమే దక్కుతుందంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

పులిచింతలలో తెలంగాణ జెన్ కో అసందర్భంగా, దౌర్జన్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన కారణంగా 7400 క్యూసెక్యుల నీరు దిగువకు వస్తోందని విష్ణు ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీ నుండి ఐదు గేట్ల ద్వారా 8,600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసారు.మరిన్ని గేట్లుఎత్తి వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృధాగా పంపుతున్నారు.కెసిఆర్ గారు మీరు చేసిన అన్యాయం ఆంధ్రా రైతుకు మాత్రమే కాదు.ఈ దేశ రైతులందరికి . మీరు చరిత్రలో రైతు ద్రోహిగా నిలిచిపోతారంటూ తీవ్ర విమర్శలు చేశారు. నేటి సమాజం హిట్లర్ ను చూడలేదు,హిట్లర్ రూపంలో ఉన్న కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా తెలుగురాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. చరిత్ర ఎన్నటికీ మీ అనైతిక అహంకార,పిచ్చి చర్యలను మరచిపోదు.స్వార్థ రాజకీయాల కోసం మీరు చేస్తున్న దుర్మార్గాలకు, తెలంగాణ రైతులు సైతం బుద్ది చెప్పే రోజు వస్తుందని విష్ణు హెచ్చరించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications