Adudam Andhra: ఎన్నో కలలు- ఒకే వేదిక-రేపే ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు..
ఏపీలో దాదాపు 50 రోజుల పాటు నిర్వహించిన అతి పెద్ద క్రీడా టోర్నీ ఆడుదాం ఆంధ్రా రేపటితో ముగియనుంది. రేపు విశాఖపట్నంలో జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. రాష్ట్ర క్రీడారంగంలో ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలవబోతున్న ఈ టోర్నీలో దాదాపు 25 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు అంచనా. గత డిసెంబర్ 26న జగన్ ప్రారంభించిన ఈ టోర్నీని రేపు ఆయన చేతుల మీదుగానే ముగించబోతున్నారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 25 లక్షల మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇందులో దాదాపు 3 లక్షల మ్యాచ్‌లు జరిగాయి. సచివాలయ స్థాయి పోటీల నుండి రాష్ట్ర స్దాయిలో ఉన్న క్రీడాకారుల వరకు ఇందులో పాల్గొన్నారు. యువతలో క్రీడా సామర్ధ్యాలను పెంచే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం, చెన్నై సూపర్ కింగ్స్, ప్రైమ్ వాలీబాల్, ప్రో-కబడ్డీ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వంటి ప్రఖ్యాత ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకుంది. ఔత్సాహిక ఆటగాళ్లను గుర్తించడం, ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగాయి.

రాష్ట్రం నుంచి జాతీయ క్రికెట్ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఈ టోర్నీలో పాల్గొంటున్న యువతలో స్ఫూర్తి నింపాడు. ఆంధ్రప్రదేశ్ వీధుల నుండి అంతర్జాతీయ క్రికెట్ వరకూ తన ప్రయాణాన్ని భరత్ తాజాగా ప్రస్తావించాడు. తాను ఆంధ్రప్రదేశ్‌లో పెరిగానని, వీధుల్లో క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నానని తెలిపాడు. అదే స్ఫూర్తితో ప్రతిభావంతులందరికీ ఓ విజ్ఞప్తి చేశాడు. క్రీడాకారులు తమ సర్వస్వాన్ని పెట్టి, గర్వంగా మన రాష్ట్రాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలన్నాడు.
ఆడుదాం ఆంధ్రా మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. తొలిసారిగా మ్యాట్ మీద మ్యాచ్ ఆడాం..!!#YSJagan #CMJagan #AdudhamAndhra #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/fE3huRAfbU
— oneindiatelugu (@oneindiatelugu) February 12, 2024
నందిగామకు చెందిన ఓ కబడ్డీ క్రీడాకారుడు వీధుల్లో ఆడడం నుండి వృత్తిపరమైన మ్యాట్‌పై పోటీ పడే వరకు తన ప్రయాణాన్ని గర్వంగా వివరించాడు. ఆడుదాం ఆంధ్రా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపాడు. కీసర సచివాలయానికి చెందిన ఆయన, నందిగామలో విజయం సాధించడంలో అమూల్యమైన సహాయాన్ని అందించిన, అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లను అభినందించారు. తాను ప్రొఫెషనల్ మ్యాట్‌పై పోటీ చేయడం ఇదే తొలిసారి అన్నాడు. ఇది కేవలం ఆడుదాం ఆంధ్ర ద్వారా మాత్రమే సాధ్యమైందన్నాడు.
ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా భర్త నన్ను ప్రోత్సహించాడు. సీఎం జగన్ కు ధన్యవాదాలు..!!#YSJagan #CMJagan #AdudhamAndhra #AndhraPradesh #ApGovt #Oneindiatelugu pic.twitter.com/18CXM4dkRU
— oneindiatelugu (@oneindiatelugu) February 12, 2024
మరో వివాహిత అయిన మహిళా క్రీడాకారిణి ఈ టోర్నీ ద్వారా తమకు సరైన వేదిక అందించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి టోర్నీ వల్ల తమకు క్రీడలతో మరింత అనుబంధం ఏర్పడిందని తెలిపారు. తాము ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వగలిగామన్నారు. ఇంత అంకితభావంతో ఆడేందుకు కీలక పాత్ర పోషించిన తమ భర్తలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ టోర్నమెంట్స్ తమ సానుకూల జీవనశైలి మార్పులకు దారితీసిందన్నారు.












Click it and Unblock the Notifications