AP Cabinet: అజిత్ పవార్ పై ఏపీ కేబినెట్ తీర్మానం..! చంద్రబాబు కామెంట్స్ ..!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (ajit pawar) ఇవాళ బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన మృతికి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు ప్రముఖులు, రాజకీయనేతలు, మంత్రులు ఇలా అందరూ ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఏపీలోని అమరావతిలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం (ap cabinet) కూడా ఈ దుర్ఘటనపై స్పందించింది.
బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై ఏపీ క్యాబినెట్ సంతాపం వ్యక్తం చేసిన సంతాపం వ్యక్తం చేసింది. క్యాబినెట్ భేటీ ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. అనంతరం ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా ఐదుగురు చనిపోవడంపై క్యాబినెట్ విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు .. అజిత్ పవార్ తో తనకు ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు.

ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి లోనయినట్లు సీఎం చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని వెల్లడించారు. అనంతరం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి మృతికి సంతాపం తెలుపుతూ ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసింది. దీనికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మహారాష్ట్రలోనూ ఏపీ తరహాలోనే ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుండగా.. అందులో పవన్ కళ్యాణ్ తరహాలోనే అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications