AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- అమరావతి నుంచి రైతుల వరకూ..!
ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో రైతుల నుంచి అమరావతి ప్రాజెక్టుల వరకూ పలు సంచలన నిర్ణయాలు ఉన్నాయి. రైతులకు ఆర్థిక చేయూతపై కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు వచ్చాయి. తోతాపురి మామిడికి మద్దతు ధర కోసం మార్క్‌ఫెడ్ నిధుల అంశంపై చర్చించారు. అనంతరం రూ.281 కోట్ల నిధుల ప్రతిపాదనలకు ఆమోదం మంత్రివర్గం తెలిపింది.
అలాగే పొగాకు రైతులకు డీబీటీ ద్వారా రూ.94 కోట్ల ఆర్థికసాయం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రిజర్వాయర్ కేజ్ కల్చర్ పాలసీ ముసాయిదాకు ఆమోదముద్ర వేశారు. మత్స్యరంగంలో కేజ్ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 78 వరద పునరుద్ధరణ పనులపై కేబినెట్ చర్చించింది. అనంతరం వరద నష్టం పునరుద్ధరణకు రూ.6.24 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. వెలిగొండ టన్నెల్‌లో టీబీఎం తొలగింపు పనులకు రూ.11.63 కోట్ల మంజూరుపై చర్చించారు.

అలాగే అమరావతిలో రహదారి నిర్మాణ విధానంలో కీలక మార్పుల ప్రతిపాదనలపై చర్చించారు. సిమెంట్ రోడ్ల స్థానంలో బీటీ రోడ్లు సీఆర్ఆర్ఎ, చీఫ్ ఇంజినీర్ల బోర్డు సిఫార్సులపై చర్చించారు. అమరావతి సంగమం నిర్మాణానికి రూ.759.79 కోట్ల అనుమతి ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అలాగే శాఖమూరులో స్టేట్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గుడ్ గవర్నెన్స్ సంస్థలతో 'అమరావతి సంగమం' ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమరావతి రైల్వే కనెక్టివిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. మార్కాపురంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదన, కడప జిల్లాలో పీఎం-కుసుమ్ కింద సోలార్ పవర్ ప్రాజెక్టుకు వచ్చిన ప్రతిపాదనను ఆమోదించారు. సీలేరు కాంప్లెక్స్‌లో ఏపీ జెన్‌కోకు ఫైర్ ప్రికాషనరీ ఫీజు మినహాయింపుకు నిర్ణయించారు. ఏపీ ట్రాన్స్‌కో మధ్యకాలిక రుణానికి రూ.950 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చారు. అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేశారు.













Click it and Unblock the Notifications