సంచలనం: కాపులకు 5 శాతం రిజర్వేషన్, ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు...
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భేటీ అయిన కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
Recommended Video

అమరావతి: ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భేటీ అయిన కేబినెట్ పలు విషయాలపై నిశితంగా చర్చించి కొన్ని పాలసీలకు ఆమోదం తెలిపింది.
సమావేశంలో ముఖ్యంగా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరనున్నాయి. రేపు ఉదయం మళ్లీ మరోసారి కేబినెట్ సమావేశం జరగనుంది.

ఈ మేరకు తీర్మానాన్ని శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. అంతకుముందు జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్ కేబినెట్ సభ్యులకు తన నివేదిక అంశాల్ని వివరించింది.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరనున్నాయి. రేపు ఉదయం మళ్లీ మరోసారి కేబినెట్ సమావేశం జరగనుంది. అలాగే 2017-20 ఐటీ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
దేశంలోనే తొలిసారిగా నూతన ఐటీ పాలసీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకే చోట ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన విధానం ఏపీలో ఐటీకి మరింత ఊతమివ్వనుంది.
పోలవరం హైడ్రో పవర్‌స్టేషన్‌ను కేబినెట్ అంగీకరించింది. రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్టీసీకి అనుమతినిచ్చింది. 8 శాతం వడ్డీతో రుణం కోసం ఆర్టీసీ కేబినెట్‌ను అనుమతి కోరింది.
నియోజకవర్గాల్లో స్థలాలు, భవనాలు లేని జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలకు కార్యాలయాల నిర్మాణం కోసం 25 సెంట్ల స్థలం కేటాయించాలని కూడా ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
ఏడాదికి రూ. వెయ్యి లీజుతో ఆయా పార్టీలకు స్థలాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. స్థలం కేటాయించిన అనంతరం మూడేళ్లలో ఆ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది
వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలని సత్యపాల్ కమిటీ ఇచ్చిన నివేదికకు కూడా కేబినేట్ ఆమోదముద్ర వేసింది. వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications