Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!!

ఏపీ రాజధాని అమరావతి పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గ తీర్మానం చేసింది. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 28న అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి నివేదించనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం అమరావతికి రాజముద్ర వేయనుంది.

ఏపీ మంత్రివర్గ సమావేశంలో అమరావతి పైన కీలక తీర్మానం చేసారు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం 2014లోని సెక్షన్-5ను స‌వ‌రించాల్సిందిగా తీర్మానం ఆమోదించారు. కొత్త రాజ‌ధానిగా సీఆర్డీఏ పరిధిలోని అమ‌రావ‌తి పేరును చేర్చాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఎల్లుండి (శనివారం) ఏపీ అసెంబ్లీలో 4గంటల పాటు రాజధాని అమరావతి పై చర్చ పెట్టి తీర్మానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రానికి పంపనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ తీర్మానం అనుగుణంగా కేంద్రం పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు ద్వారా అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా నిర్దారిస్తూ రాజముద్ర వేసే విధంగా కార్యా చరణ సిద్దం అయింది. కాగా, ఈ తీర్మానం ఆమోదం సమయంలో కేబినెట్ లో ఆసక్తి కర చర్చ సాగింది. రాజధాని చరిత్ర ప్రజలకు తెలియచేయాలన్న సీఎం.. నాటి అంశాలను ప్రస్తావించారు.

ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!
ap-cabinet-passes-resolution-urging-the-union-government-to-grant-legal-sanctity-to-amaravati-as-th

కేబినెట్ లో కీలక నిర్ణయాలు

అమరావతి రాజధానిగా సమర్ధించిన జగన్, 3రాజధానులు నాటకాన్ని ప్రజలకు గుర్తుచేయాలని మంత్రులు సూచించారు. మూడు రాజధానుల నాటకం లో నాడు మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పై దాడి జరిగినంత పనైందని ప్రస్తావన చేసారు. కాగా, రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పై క్యాబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జగజ్జీవన్ రామ్ జయంతి రోజు(ఏప్రిల్ 5) మొదలుకుని అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) లోపు ప్రతీ నియోజకవర్గంలో 2వేలు చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పీఎం కుసుమ్ ద్వారా పవర్ లాస్ లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేసారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు 33/11కేవీ సబ్ స్టేషన్ ల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ శాఖ ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేసారు. అదే విధంగా వంట గ్యాస్ సరఫరా.. రాష్ట్రంలో పీఎన్ జీ పాలసీకి ఆమోదం తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+