జగన్ కు కేబినెట్ సవాల్-ఏమాత్రం తేడా వచ్చినా ! 2024 ఎన్నికలపై ప్రభావం-ఈక్వేషన్లు ఇవే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరి మూడేళ్లు పూర్తికావస్తోంది. త్వరలో కేబినెట్ ప్రక్షాళన చేపట్టబోతున్నట్లు సీఎం జగన్ మంత్రులకు సంకేతాలు ఇచ్చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేళ్ల పదవీకాలంతో పాటు బోనస్ గా మరో ఆరునెలలు కూడా పూర్తి చేసుకోబోతున్న మంత్రుల్లో చాలా మంది మాజీలు కాబోతున్నారు. అయితే వీరి స్దానాల్లో కొత్తగా ఎవరు రాబోతున్నారనే ఉత్కంఠతో పాటు ఈ ఎంపిక జగన్ కు కచ్చితంగా సవాల్ విసరబోతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2024లో వైసీపీ జాతకాన్ని ఈ ఎంపికే నిర్ణయించబోతుండటం ఇక్కడ ప్రధానాంశం.

జగన్ కేబినెట్ ప్రక్షాళన
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో సీఎం జగన్ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం జూన్ లో జరగబోతున్న ఈ ప్రక్షాళన వైసీపీ ప్రభుత్వ రూపురేఖల్ని మార్చబోతోంది. ముఖ్యంగా ఉగాదికి ఏర్పాటు కాబోతున్న కొత్త జిల్లాల్లో కొత్త ముఖాలతో జగన్ కొత్త దనాన్ని కోరుకుంటున్నారన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపబోతున్నారు. తద్వారా ఇప్పటివరకూ ప్రభుత్వంపై పడిన ముద్రల్ని చెరిపేసుకునేందుకు ఇదో మంచి అవకాశంగా మల్చుకోబోతున్నారు.

కేబినెట్ ను తేల్చే లెక్కలివే
గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసినా, విభజన తర్వాత ఏపీలో చూసినా ఏ ప్రభుత్వం ఏర్పాటులోనైనా కుల సమీకరణాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి అవే కులసమీకరణాలు కీలకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా కుల సమీకరణాల మిక్సింగ్ లో కింగ్ గా పేరున్న సీఎం జగన్..ఈసారి వేసే లెక్కలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ సగటు ఏపీ పౌరుడిలో కనిపిస్తోంది. ఎందుకంటే కుల సమీకరణాల్లో వేసే ప్రతీ తప్పటడుగు కచ్చితంగా అధికారాన్ని వైసీపీకి దూరం చేసే ప్రమాదం పొంచి ఉండటమే. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లాలకు మంత్రుల ప్రాధాన్యం దక్కకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కాబట్టి ప్రతీ జిల్లాకో మంత్రిని తప్పక కేటాయించాల్సిన పరిస్ధితి. దీంతో 26 జిల్లాల్లో 25 మంది మంత్రులను ఇచ్చినా మరో జిల్లా ఖాళీగా ఉంటుంది. అసలే తాను కడపకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున మిగిలిన వారిని అదే జిల్లా నుంచి తీసుకోలేని పరిస్దితి.
దీంతో జిల్లాల వారీగా జగన్ పాటించే సమీకరణాలు వైసీపీ నేతల్లో సంతృప్తి లేదా అసంతృప్తకి కారణం కాబోతున్నాయి.

కొత్త, పాత మంత్రుల సమన్వయం
కేబినెట్ ప్రక్షాళన వందశాతం ఉండే అవకాశం లేదని తేలిపోయింది కాబట్టి ఇందులో ఎవరు ఉండబోతున్నారు, ఇంకెవరు పదవులు వదులుకుంటున్నారనేది ఇప్పుడు చాలా కీలకం. కేబినెట్ లో కొనసాగే అవకాశం దక్కనివారు కచ్చితంగా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుందని జగన్ చెప్పేశారు. కాబట్టి వారు కేబినెట్ పదవిని కోల్పోయాక పార్టీ కోసం అంతే స్ధాయిలో పనిచేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. అదే సమయంలో కొత్తగా కేబినెట్ లోకి వచ్చేవారి పెత్తనంతో ఆయా జిల్లాల్లో వీరి పాత్ర నామమాత్రం అవుతుంది. వీరిమధ్య సమన్వయంలో ఏ తేడా వచ్చినా వైసీపీకి ఎన్నికల ముందు చుక్కలు కనిపించడం ఖాయం.

బెర్తు దక్కని వారితో సమస్య
జగన్ తన కేబినెట్ విస్తరణలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో దాదాపు 20కి పైగా మంత్రుల్ని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరి స్ధానంలో మరో 20 మందికి మాత్రమే అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన చూస్తే కొత్త, పాత మంత్రులు కలిపినా వైసీపీ గెలిచిన 151 మందిలో 40 నుంచి 45 మందే అవుతారు. అంటే మరో 100 మందికి పైగా ఎమ్మెల్యేలు కేబినెట్ అవకాశం దక్కకుండానే మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు వారు తమకు కేబినెట్ బెర్తులు దక్కలేదనే ఆవేదనతో పార్టీ మార్పుకు కూడా సిద్ధపడే అవకాశాలు లేకపోలేదు. దీంతో వారి విషయంలో జగన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
Recommended Video

ఏమాత్రం తేడా వచ్చినా 2024 గల్లంతే ?
జగన్ కేబినెట్ విస్తరణలో ఈసారి పాటించే సమీకరణాలు, అసంతృప్తులను బుజ్జగించే తీరు కచ్చితంగా 2024లో జరిగే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఎందుకంటే ఎన్నికల టీమ్ గా అభివర్ణిస్తున్న కేబినెట్ అటు సీఎం జగన్ తో పాటు ప్రజల్ని కూడా మెప్పించాల్సి ఉంటుంది. అలాగే పార్టీలోనూ పనిచేసే వారికి న్యాయం జరిగిందన్న ఫీల్ కల్పించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడ విఫలమైనా దాని ప్రభావం వైసీపీపై పడటం ఖాయం. అన్నీ సవ్యంగా జరిగితే 2024 ఎన్నికల్లో మరోసారి అధికారం దక్కడం ఖాయం. కానీ ఏమాత్రం తేడా వచ్చినా కచ్చితంగా విపక్షాలు దీన్ని సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. మరి విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా జగన్ తీసుకోబోయే నిర్ణయాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications