రుషికొండ పైన మళ్ళీ నిర్మాణాలు- కీలక ప్రతిపాదనలు..!!
రుషికొండ భవనాల పైన కీలక మంత్రాంగం సాగుతోంది. ఈ భవనాల వినియోగం పైన పలు రకాల ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఆతిథ్య రంగానికి చెందిన ప్రముఖులు తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొంత మంది నిర్వహణకు ముందుకు వస్తూ.. తమ డిమాండ్లను వివరించారు. దీని పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదనల పైన చర్చించింది. కీలక అంశాలను వెల్లడించింది.
రుషికొండ ప్యాలెస్‌ను ఎలా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 3వ భేటీ ఈరోజు (బుధవారం) జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలను ఏపీ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ప్యాలెస్‌ను ఇచ్చే అంశంపై పరిశీలించినట్లు తెలిపారు. కానీ, కొంతమంది హోటల్ కోసం అదనపు స్థలం కావాలని అడిగారని చెప్పారు. రుషికొండ కింద ఉన్న 9 ఎకరాలు స్థలంలో ఏడు ఎకరాలు సీఆర్‌జెడ్ నిబంధనలోకి వస్తాయని.. ఆ 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణం చేయకూడదన్నారు. తమకు ఇదో సవాల్‌గా మారిందన్నారు. శుక్రవారం మరోసారి సమావేశం అవనున్నట్లు చెప్పారు. కాగా.. రుషికొండ నిర్మాణాలపై మళ్ళీ నిర్మాణాలు చేసే అవకాశం ఉందని.. పైన రెండు ఫ్లోర్లు వేసుందుకు అనుకూలంగా ఉందని వివరించారు.

కాగా.. రుషికొండ చివరి రెండు బ్లాక్‌లు ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు, టూరిస్ట్ అవసరాల కోసం ఉంచుతామని చెప్పారు. తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూప్, అట్మాస్పియర్ కోర్ వంటి గ్రూప్ హోటల్స్ ముందుకు వచ్చాయని మంత్రి పయ్యవుల కేశవ్ పేర్కొన్నారు. కందుల దుర్గేశ్ సైతం స్పందించారు. మరోసారి రుషికొండ వినియోగంపై చర్చ జరుగుతుందన్నారు. అనేక ప్రపోజల్స్ వస్తున్నాయని.. వైబుల్ ప్రాజెక్ట్ ఏంటి అనే అంశంపై దృష్టి పెట్టామని తెలిపారు. సముద్రం ఆటు పోట్ల వల్ల రుషికొండ కింద 9 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయన్నారు. ఏడు ఎకరాలు సీఆర్‌జెడ్ నిబంధనల పరిధిలోకి ఉంటాయని మంత్రి దుర్గేశ్ వెల్లడించారు. ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో రుషికొండ భవనాల పైన చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
-
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications