మహిళలకు ఉచిత బస్సు, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు - మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలు పూర్తవుతోంది. పాలనా పరంగా.. రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పై కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 4న జరగాల్సిన మంత్రివర్గ భేటీ..3వ తేదీకి మార్పు చేసారు. ఈ భేటీ లో కొత్త రేషన్ కార్డులతో పాటుగా పెన్షన్ల దరఖాస్తుల ఖరారు మార్గదర్శకాల పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. పవన్ కల్యాణ్ లేవనెత్తిన బియ్యం మాఫియా అంశం పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
పాత రేషన్ కార్డులు రద్దు
ఏపీ మంత్రివర్గ సమావేశం షెడ్యూల్ మారింది. ఈ నెల 4న జరగాల్సిన సమావేశం ముందుగానే ఈ నెల 3న జరగనుంది. ఈ సమావేశం పాలనా పరమైన అంశాలతో పాటుగా రాజకీయ పరిణామా ల పైన చర్చ జరగనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్డులను రద్దు చేసి కొత్తగా రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదే విధంగా రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు కానుండటంతో కార్డుల జారీ ప్రక్రియలో మార్గదర్శకాల పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. అదే విధంగా కొత్త పెన్షన్ల మంజూరు పైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 2 నుంచి జన్మభూమి -2 ప్రారంభం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఉచిత బస్సు - రైతుల ఖాతాల్లో నిధులు
జన్మభూమి -2 లో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో.. జన్మభూమి నిర్వహణ పైన ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అదే సమయంలో అనర్హులకు రేషన్ కార్డులు...పెన్షన్ల తొలిగింపు పైనా మంత్రులు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంది. రేషన్ కార్డులను పూర్తిగా మార్పు చేసి కొత్త డిజైన్లతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ భేటీలో ఉచిత బస్సుతో పాటుగా రైతులకు రూ 20 వేల నగదు జమ అంశం పైనా చర్చించనున్నారు.

ఆదానీ - జగన్ ముడుపుల పై
రాజకీయంగానూ ఈ భేటీ కీలకంగా మారనుంది. ఇసుక, మద్యం పాలసీలో రాజకీయ జోక్యం పెరిగి పోతోందనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా కాకినాడ నుంచి బయ్యం స్మగ్లింగ్ పై పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. దీంతో, బియ్యం అక్రమ రవాణా నిరోధానికి తీసుకో వాల్సిన చర్యల పైనా చర్చించనున్నారు. ప్రజా పంపిణీ బియ్యం పక్క దోవ పట్టకుండా నిర్ణయాల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల సంచలనంగా మారిన అదానీ విద్యుత్ కొనుగోళ్ల లంచం వ్యవహారం, అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర వంటి అంశాలపైనా సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications