ఏపీ కేబినెట్ భేటీ : సీపీఎస్ - మూడు రాజధానుల పై నిర్ణయం..!!
కీలక అంశాలపైన నిర్ణయం దిశగా ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో ఈ నెల 12 లేదా 19వ తేదీ నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీని పైన ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. మూడు రాజధానుల అంశం పైన హై కోర్టు తీర్పుపై న్యాయ పరంగా ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటోంది.

మూడు రాజధానులపై ఏం చేద్దాం
వీటిని మంత్రివర్గంలో చర్చించి.. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లోగా మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి చేస్తామని తాజాగా మంత్రి అమర్ నాధ్ స్పష్టం చేసారు. దీంతో.. ముందుగా ముఖ్యమంత్రి విశాఖ కేంద్రంగా తన క్యాంపు కార్యాలయం నుంచి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, సీపీఎస్ రద్దు అంశం ఇప్పుడు ప్రభుత్వానికి సమస్యగా మారింది. 2019 ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు పైన ఇచ్చిన హామీ నిలబెట్టు కోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నాయి.

సీపీఎస్ వ్యవహారం పైనా నిర్ణయం
ఈ సమయంలోనే ప్రభుత్వం జీపీఎస్ పైన ప్రస్తావన చేస్తోంది. దీనికి ఉద్యోగ సంఘాలు ససేమిరా అంటున్నాయి. ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో పదవీ విరమణ తరువాత గ్యారంటీ పెన్షన్ స్కీం పైనే మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తాజాగా ఉపాధ్యాయ దినోత్సవ సభలోనూ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ కేబినెట్ సమావేశంలో దీని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అదే విధంగా.. ఇప్పటికే వచ్చే ఎన్నికలకు మందుస్తుగా సమాయత్తం అవ్వటంలో భాగంగా.. గడప గడపకు ప్రభుత్వం పైన సీఎం తాజా పరిస్థితిని వివరించే అవకాశం ఉంది. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలోనే..జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు చెబుతున్నారు.

అసెంబ్లీ సమావేశాలు - పొత్తు రాజీకీయం
ఇప్పటికే ఎమ్మెల్యేలకు డెవలప్ మెంట్ ఫండ్స్ తో పాటుగా సచివాలయాల వారీగా నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరోసారి సీఎం జగన్ మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇక..ఏపీలో ప్రతిపక్ష పార్టీల పొత్తుల అంశం పైన అధికారిక అజెండా ముగిసిన తరువా రాజకీయంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు కలిసినా...వైసీపీ ఒంటరిగానే ముందుకెళ్లేందుకు సిద్దం అవుతుంది. ఇదే విషయం పైన సీఎం జగన్ తాజా రాజకీయాల పైన మంత్రులకు దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.
-
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications