ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు-ఉద్యోగాల భర్తీ నుంచి ఉద్యోగుల వరకూ..
ఇవాళ అమరావతిలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఈ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే నిరుద్యోగులకు కూడా పలు గుడ్ న్యూస్ లు అందించారు. త్వరలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపిన కేబినెట్.. అలాగే అభివృద్ధి పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ కేబినెట్ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏపీలో కొత్త గా 6840 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014 జూన్ 2 తేదీ నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు ఆమోదం ఇచ్చింది. ఏపీ వైద్య విధాన పరిషత్ చట్టాన్ని ను రద్దు చేసి దాన్ని ప్రభుత్వ శాఖ గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులోని ఉద్యోగులకు 010 హెడ్ నుంచి వేతనాలు ఇవ్వాలనీ నిర్ణయించారు. ఏపీ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అమలుకు కేబినెట్ నిర్ణయించింది. వారి వేతనం లో 50 శాతం పెన్షన్ గా నిర్ధారిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

16 శాతం ఉద్యోగుల హెచ్ అర్ ఏ ను అన్ని జిల్లాల కేంద్రాలకు అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రతీ మండలం లో రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు కు నిర్ణయం తీసుకున్నారు. 3 నుంచి 10 తరగతి విద్యార్థులకు టోఫెల్ కు శిక్షణ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ఒడిషా రైలు దుర్ఘటన మృతులుకు కేబినెట్ సంతాపం తెలిపింది. చిత్తూరు డైరీ నిర్వహణ అముల్ కు ఇస్తూ 28 ఎకరాల భూమిని 99 ఏళ్ళ కు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు అయిన మెడికల్ కళాశాలలకు 2118 పోస్టుల భర్తీకి నిర్ణయించారు.
పదోతరగతి పరీక్షల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ప్రోత్సాహం గా ఆణిముత్యాలు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 12 నుంచి 17 వరకూ విద్యా కానుక వారోత్సవాలు జరపాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. అమ్మ ఒడి ఆర్థిక సహకారాన్ని జూన్ 28 తేదీన ఇవ్వాలనీ నిర్ణయించారు. 476 జూనియర్ కళాశాలలో వాచ్ మెన్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.గ్రీన్ హైడ్రోజెన్, అమ్మోనియా పాలసీకి కేబినెట్ ఆమోదం ఇచ్చింది. హైడ్రోజెన్, అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సదుపాయం 5 జి నెట్ వర్క్ కల్పించేందుకు ఏపీ ఎఫ్ ఎస్ ఎల్ 445 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications