Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్నూలుకు మారిన క్యాపిటల్ పాలిటిక్స్-హైకోర్టుపై ఏకాభిప్రాయం ? విశాఖతో పోలిస్తే అడ్వాంటేజ్ !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల్లో అత్యధికుల దృష్టి అమరావతిపైనే ఉంది. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఇక్కడ రాజధాని ఏర్పాటు మొదలుకావడం, విపక్షాల మద్దతుతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇక్కడి నుంచి విశాఖకు కార్యనిర్వాహక రాజధాని మారుస్తామంటూ చేస్తున్న ప్రతిపాదన ఉత్తరాంధ్రలో సంతోషం నింపుతుండగా.. మిగతా ప్రాంతాలకు మాత్రం దూరాభారం కారణంగా అంత సంతృప్తినివ్వడం లేదని తెలుస్తోంది. ఇక మిగిలిన మరో రాజధాని కర్నూలు విషయంలో మాత్రం ఈ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కర్నూల్లో న్యాయరాజధాని

కర్నూల్లో న్యాయరాజధాని

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు న్యాయ రాజధాని కేటాయించింది. అంటే హైకోర్టుతో పాటు న్యాయశాఖకు సంబంధించిన పలు విభాగాలు ఇక్కడికి తరలిరానున్నాయి. దీంతో కర్నూలు న్యాయరాజధానిగా మారాలన్నది వైసీపీ ప్రభుత్వ వ్యూహం. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి ఓసారి రాజధానిగా ఉన్న కర్నూలుకు న్యాయం జరగాలంటే ఇక్కడ న్యాయరాజధాని ఉండాలని ప్రభుత్వంచెబుతోంది. అయితే విపక్షాలు మాత్రం అమరావతిలో ప్రధాన రాజధాని కోరుతున్నా కర్నూలు హైకోర్టు విషయంలో మాత్రం కాస్త పట్టువిడుపులు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు టూర్ తో మారిన సీన్

చంద్రబాబు టూర్ తో మారిన సీన్


తాజాగా కర్నూలు జిల్లాలో విపక్ష నేత చంద్రబాబు పర్యటించారు. ఈ టూర్ ఆదోని,ఎమ్మిగనూరు, కోడుమూరు వంటి చోట్ల సజావుగా సాగిపోయింది. అనంతరం కర్నూల్లో మాత్రం లాయర్లు, వైసీపీ కార్యకర్తల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఇందులో వారు చంద్రబాబును కర్నూల్లో హైకోర్టుకు మాత్రం అడ్డుపడొద్దని కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు.. గతంలో కర్నూల్లో హైకోర్టును తానే ప్రతిపాదించానని చెప్పుకొచ్చారు. దీంతో ఆ తర్వాత చంద్రబాబు టూర్ కూడా ఎలాంటి అడ్డంకుల్లేకుండా సాగిపోయింది. అదే సమయంలో కర్నూల్లో న్యాయరాజధాని పేరుతో హంగామాకు బదులు హైకోర్టును ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చనే సంకేతాలు వెళ్లాయి.

కర్నూలు హైకోర్టుపై ఏకాభిప్రాయం ?

కర్నూలు హైకోర్టుపై ఏకాభిప్రాయం ?

కర్నూల్లో హైకోర్టుపై చంద్రబాబు తన టూర్ లో సూచన ప్రాయంగా సంకేతాలు ఇచ్చారు. గతంలో తాను చేసిన ప్రతిపాదనే కాబట్టి తాను వ్యతిరేకించబోను అన్నట్లుగా చంద్రబాబు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిచ్చాయి. అదే సమయంలో బీజేపీ కూడా కర్నూల్లో హైకోర్టును తమ రాయలసీమ డిక్లరేషన్ లో ఇప్పటికే పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఓసారి చంద్రబాబు, బీజేపీ ఒప్పుకుంటే వైసీపీ ప్రతిపాదిస్తున్న కర్నూలు హైకోర్టు ప్రతిపాదనకు దాదాపు ఏకాభిప్రాయం లభించినట్లే భావించవచ్చని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై విపక్షాలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చిస్తే కర్నూలుకు హైకోర్టును తరలించడం అంత సమస్యకాకపోవచ్చు.

వైజాగ్ తో పోలిస్తే అడ్వాండేజ్ ?

వైజాగ్ తో పోలిస్తే అడ్వాండేజ్ ?

ఉత్తరాంధ్రలో కార్యనిర్వాహక రాజధాని కానున్న వైజాగ్ తో పోలిస్తే కర్నూలు హైకోర్టు ప్రతిపాదనకు ఎక్కువ మంది మద్దతు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖలో ప్రధాన రాజధాని పెట్టడం వల్ల దూరాభారంతో పాటు అందుబాటు సమస్యలు తప్పవనే అభిప్రాయం ఉంది. కానీ వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే ఇది తప్పనిసరని మరికొందరు చెప్తున్నారు. ఈ విధంగా వైజాగ్ పై మిశ్రమ అభిప్రాయాలున్నాయి. కానీ కర్నూల్లో హైకోర్టుకు మాత్రం వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కర్నూలు హైకోర్టు ప్రతిపాదన వైజాగ్ తో పోలిస్తే అత్యధికుల మద్దతు పొందినా ఆశ్చర్యం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+