హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Raghu Rama Krishna Rajuకు బర్త్‌డే గిఫ్ట్‌- హైదరాబాద్‌లో సీఐడీ అరెస్ట్ ? ‌-సీఆర్పీఎఫ్‌ హంగామా

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ హైదరాబాద్‌లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. వై ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న రఘరామకృష్ణంరాజును అరెస్టు చేసేందుకు ఇవాళ ఆయన నివాసానికి వచ్చిన సీఐడీ పోలీసులకు సీఆర్పీఎఫ్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రఘురామను అరెస్టు చేయడం కుదరదని సీఆర్పీఎఫ్‌ పోలీసులు స్పష్టం చేశారు. అయితే చివరికి వారు రఘురామకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Raghurama Krishnam Raju బర్త్ డే రోజు అరెస్ట్.. Ys Jagan గట్టి దెబ్బ కొట్టాడు!! || Oneindia Telugu

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయనపై వైసీపీ సర్కారుకు చర్యలకు ఉపక్రమించింది. ఇవాళ హైదరాబాద్‌లోని రఘురామకృష్ణరాజు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను సీఐడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ap cid arrest ysrcp rebel mp raghurama krishnam raju in hyd residence

అయితే, రఘురామకృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్ ను అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామను కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు. కాగా రఘురామకృష్ణరాజుపై 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ రఘురామకృష్ణరాజు పుట్టినరోజు కావడం విశేషం.

English summary
andhra pradesh cid on today arrested ysrcp rebel mp raghurama krishnam raju against his comments on ap cm ys jagan and ap govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X