నిమ్మగడ్డ లేఖపై మరో సంచలనం-ఆధారాల ధ్వంసం..సీఐడీ దర్యాప్తు కలకలం..
ఏపీలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నా.. ఆయనపై సాగుతున్న దర్యాప్తు ఇంకా సంచలనాలు రేపుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన కేంద్రానికి రాసిన లేఖ వివాదాస్పదం కావడంతో దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సీఐడీకి పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా నిమ్మగడ్డను ఫిక్స్ చేసేందుకు సీఐడీ అధికారులు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిమ్మగడ్డపై సీఐడీ దర్యాప్తు....
ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు అదనపు భద్రత కావాలని కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ వ్యవహారంలో వివాదాస్పద అంశాల కారణంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కు అదనపు పీఎస్ గా వ్యవహరించిన సాంబమూర్తిని విచారించిన అధికారులు పలు కీలక అంశాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో ఇవే కీలకం కానున్నట్లు అర్ధమవుతోంది.

ఫైల్స్ డిలీట్.. ఆధారాల ధ్వంసం...
నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి విచారణ సందర్భంగా వివాదాస్పద లేఖ ఎవరు రాశారు, ఎక్కడి నుంచి ఎవరెవరికి పంపారన్న అంశాలపై అధికారులు ప్రశ్నించారు. ఇందులో ఆయన.. ఇందుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసినట్టు అంగీకరించారు. ల్యాప్ టాప్‌లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్ ద్వారా లేఖను డెస్క్ టాప్‌లో వేసినట్టు సాంబ మూర్తి చెప్పారు. ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపారు. ఆ లేఖను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్టు సమాచారం. ల్యాప్ టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు, పెన్ డ్రైవ్ ధ్వంసం చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. అనంతరం డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారని చెప్పారు.

ఆధారాల ధ్వంసం వెనుక...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన అధికారిక లేఖ నిజమైనదే అయినప్పుడు దాన్ని రూపొందించిన కంప్యూటర్ తో పాటు ఇతర పరికరాలను ఎందుకు ధ్వంసం చేశారనే అంశాన్ని ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేస్తోంది. పీఎస్ సాంబమూర్తి విచారణ సందర్భంగా ఇదే ప్రశ్న అయన్ను అడిగినప్పుడు... ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారో తనకు తెలియదనే సమాధానం వచ్చింది. దీంతో దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు
Recommended Video

బయట నుంచే లేఖ వచ్చిందా...
వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి గతంలో ఆరోపించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఈ లేఖ బయట నుండి వచ్చి ఉండే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.
ఆధారాలు ట్యాంపర్ చేసిన అంశంపై కేసు నమోదు చేశామని సీఐడీ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. లేఖ నంబర్‌పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. కేంద్రానికి రాసిన లేఖ 221 నంబరే, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు రాసిన రిఫరెన్స్ లెటర్‌కు కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత సంచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications