జనం తిరుగుబాటు చేయాలి..టీడీపీ నేతల తీరుపై విసిగిపోయిన చంద్రబాబు ..!

ఏపీలో గత వైసీపీ సర్కార్ హయాంలో ఇసుక, మద్యం అక్రమాలపై కూటమి పార్టీల నేతలు నిత్యం పోరాటాలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే ఇసుక, మద్యం అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పి ఓట్లు కూడా వేయించుకున్నారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక అవే ఇసుక, మద్యం అక్రమాల్లో ఆయా పార్టీల నేతలే మునిగితేలుతున్నారు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు స్వయంగా సీఎం చంద్రబాబే తరచుగా చెప్తున్నారు.

తాజాగా కూటమి ప్రభుత్వం మద్యం, ఇసుక విధానాలను అమల్లోకి తెచ్చింది. వీటిని కచ్చితంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అధికార పార్టీల నేతలే వీటికి తూట్లు పొడవడం మొదలుపెట్టేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారు చేస్తున్న దందాలు ఏ స్ధాయిలో ఉన్నాయంటే వీటిపై స్వయంగా సీఎం చంద్రబాబే జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. వీరికి పదే పదే హెచ్చరికలు చేయాల్సి వస్తోంది. తాజాగా ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబు ఇలాంటి హెచ్చరికలే చేశారు.

ap cm Chandrababu another warning to own tdp leaders against sand liquor irregularities

ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ సొంత పార్టీ నేతల్ని చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా ఇసుక దందా చేస్తే జనం తిరుగుబాటు చేయాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్నారు. మద్యం, ఇసుక విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదని మరోసారి తేల్చిచెప్పేశారు.అంతే కాదు గీత దాటితే ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+