సీమకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నది జగనే: బాబు
హైదరాబాద్: రాయలసీమకు నీళ్లు రాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆయన శనివారం ఏపి ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు గంగా ప్రాజెక్టును అడ్డుపడ్డారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టిసీమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు నీళ్లు అడుగుతాయని ప్రచారం చేయడం దారుణమని అన్నారు. నదుల అనుసంధానంతో జరిగే మేలు గురించి నేతలు ప్రజలకు తెలియజేయాలి అన్నారు.

తండ్రి బాటలోనే జగన్: సోమిరెడ్డి
తండ్రి బాటలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవడానికే జగన్ యత్నిస్తున్నారని విమర్శించారు. పట్టిసీమను అడ్డుకునేందుకు ప్రధానిని కలవడం దుర్మార్గమని సోమిరెడ్డి మండిపడ్డారు.
ఇది ఇలా ఉండగా ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును శనివారం ఏపి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పరిశీలించారు. 2016లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications