పారిపోను: చంద్రబాబు, విద్యార్థులతో... (పిక్చర్స్)
విశాఖ: తాను పిరికివాడిని కాదని, అవరోధాలను, ఇబ్బందులను సమస్యలను చూసి పారిపోనని, అది తన రక్తంలోనే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏ చిన్న అవకాశం దొరికినా పోరాడి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. విజయనగరం చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కేంద్రప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకులు సహకరించకపోయినా రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

చంద్రబాబు
రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా ఉద్యోగుల సంక్షేమం కోసం 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. అవసరమైతే ఉద్యోగులు సెలవులు రద్దు చేసుకొని పేదప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ఐదేళ్లూ కష్టించి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నమూనాను పరిశీలించారు. లక్ష మరుగుదొడ్ల నిర్మాణం, పార్వతీపురంలో వంద పడకల ఆసుపత్రి, చీపురుపల్లిలో ముప్పై పడకల ఆసుపత్రికి సంబంధించిన పైలాన్లను ఆవిష్కరించారు.

చంద్రబాబు
రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించేశారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు లేకపోయినా ఉన్న చిన్న అవకాశంతోనే నెట్టుకువస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు
డ్వాక్రా మహిళలకు రూ. 10వేలు చొప్పున చెల్లిస్తామన్న ఆయన, డ్వాక్రా రుణమాఫీతో పాటు వడ్డీలేని రుణాల్ని మంజూరుచేసే బాధ్యత కూడా తనదేనన్నారు.

చంద్రబాబు
తాను పిరికివాడిని కాదని, అవరోధాలను, ఇబ్బందులను సమస్యలను చూసి పారిపోనని, అది తన రక్తంలోనే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు
ఏ చిన్న అవకాశం దొరికినా పోరాడి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. విజయనగరం చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు
కేంద్రప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకులు సహకరించకపోయినా రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

చంద్రబాబు
విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని సీఎం చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో బుధవారం ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

చంద్రబాబు
విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో వృత్తి విద్య, ఇతర ప్రతిభా రంగాల్లో శిక్షణ ఇప్పిస్తే మేలు జరుగుతుందన్న లెండి కళాశాల విద్యార్థిని సంధ్య సూచనకు ముఖ్యమంత్రి స్పందించారు.

చంద్రబాబు
విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని సీఎం చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో బుధవారం ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Click it and Unblock the Notifications