ఆ విషయంలో జగన్ సూపర్ హిట్ ..రేవంత్ రెడ్డి ఫెయిల్
కేసీఆర్ ప్రభుత్వ హయంలో సినీ ఇండస్ట్రీకి మద్దతు లభించేది. కాని రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత తొలిసారి సినిమా ఇండస్ట్రీ విషయంలో ఫెయిల్ అయినట్టే కనిపిస్తుంది. గుంటూరు కారం సినిమా విషయంలో ఈ విషయం స్పష్టంగా అవుతుంది. అసలు మ్యాటర్‌లోకి వెళ్తే.. సినిమా ఫంక్షన్లు జరగాలంటే హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది.
చిన్న సినిమాల నుంచి ప్యాన్ ఇండియా రేంజ్ సినిమా ఈవెంట్‌లను ఘనత హైదరాబాద్‌కు ఉంది. అయితే అదంతా గతం. ఇప్పుడు భద్రత కారణాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం సినిమా ఈవెంట్‌లకు అనుమతి నిరాకరిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత ఒక్క పెద్ద సినిమా విడుదలైంది. ప్రభాస్ నటించిన సలార్ సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమాకు చిత్ర యూనిట్ ఎటువంటి ఈవెంట్ నిర్వహించలేదు. దీంతో ఎటువంటి సమస్య తలెత్తలేదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ భద్రత కారణాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పర్మిషన్ ఇవ్వలేదు.

కాని ఇదే సమయంలో జగన్ సర్కార్ గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వడమే కాకుండా ఈ ప్రొగ్రామ్‌ను గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చర్యలు తీసుకుంది. 1000 మంది పోలీసులతో జగన్ ప్రభుత్వం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బందోబస్తు కల్పిచింది. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగ్గకుండా ఈ ఈవెంట్ ఘనంగా ముగిసింది.

జగన్ సర్కార్ చేసిన ఏర్పాట్లపై చిత్ర యూనిట్ సైతం హర్షం వ్యక్తం చేసింది. మహేష్ బాబు సైతం తన ప్రసంగంలో గుంటూరు పోలీసులతో పాటు, వైసీపీ సర్కార్‌కు ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు. గుంటూరు కారం విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ కాగ, జగన్ సర్కార్ సక్సెస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!











Click it and Unblock the Notifications